ఆ బాలికది అభం శుభం తెలియని వయసు.కంటికి రెప్పలా కాపాడాల్సిన తన తండ్రి, అన్నలే వేర్వేరుగా అత్యాచారం చేశారు.
ఈ విషయం ఆ పసి మనసు ఎవరికీ తెలపలేకపోయింది.ఇదే ఘోరమనుకుంటే వారికి తోడు తాత, బంధువు కూడా లైంగిక వేధింపులకు ఓడిగట్టారు.
ఇంతటి దారుణాలను బాలిక మదిలోనే దాచుకుంది.ఎవరికి చెప్పాలో తెలియక.
ఎలా వెల్లడించాలో పాలుపోక నకరయాతన అనుభవించింది.చివరికి తాను చదువుతున్న స్కూలులో గుడ్ టచ్-బ్యాడ్ టచ్ పై అవగాహన కల్పించగా తనకు జరిగిన దారుణాన్ని ఆ బాలిక వెల్లడించింది.
విషయం పోలీసుల వరకు చేరడంతో కీచకుల దారుణం వెలుగులోకి వచ్చింది.ఈమేరకు కేసు నమోదు చేశారు.
ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని పుణెలో చోటుచేసుకుంది.అసలు వివరాలలోకెళ్తే…
బీహార్‌కు చెందిన ఓ కుటుంబం ప్రస్తుతం మహారాష్ట్రలోని పుణెలో నివాసముంటోంది.
సదరు కుటుంబానికి చెందిన 11 ఏండ్ల బాలిక తనకు జరిగిన దారుణంపై వివరించింది.స్కూల్‌లో శనివారం లైంగికదాడులపై సదస్సు నిర్వహించారు.
లైంగికదాడులకు సంబంధించి ఎవరికైనా ఎదురైతే చెప్పాలని కౌన్సిలర్లు కోరారు.దీంతో సదరు బాలిక తనకు ఎదురైన దారుణాన్ని వివరించింది.2017లో బీహార్‌లో నివసిస్తున్నపుడు తన తండ్రి, అన్నయ్య నవంబర్ 2020లో అత్యాచారంచేశారని టీచర్లకు వెల్లడించింది.

అంతేకాకుండా తన తాత, మామ వరుసయ్యే ఓబంధువు కూడా అనుచితంగా తాకేవారని తెలిపింది.ఐదేండ్లుగా ఈ దారుణాలు జరుగుతున్నాయని వివరించింది.విషయం తెలుసుకుని టీచర్లు అవాక్కయి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
వెంటనే సీఐ అశ్విని సత్పుటే అక్కడకు చేరుకుని వివరాలు సేకరించారు.అనంతరం బాలిక తండ్రి, తాత, అన్న, దూరపు బంధువుపై పోక్సో యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు.
అయితే బాలికపై వేర్వేరుగా లైంగికదాడి ఘటనలు జరిగినందున సామూహిక లైంగికదాడి కింద కు రాదని వివరించారు.కేసు దర్యాప్తు చేస్తున్నామని, ఇప్పటి వరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని వెల్లడించారు.







