ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ తో ఫుల్ బిజీగా ఉన్న రాజమౌళి గురించి ఓ న్యూస్ బయటకు వచ్చింది.ఆర్.
ఆర్.ఆర్ తర్వాత మహేష్ తో సినిమా చేయాలని ఫిక్స్ అయిన జక్కన్న తన నెక్స్ట్ సినిమా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో చేస్తాడని టాక్.అయితే ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ లో భాగంగా మహేష్ సినిమా గురించి ప్రస్థావించిన రాజమౌళి అల్లు అర్జున్ తో చేయబోతున్న సినిమా గురించి మాత్రం ప్రస్థావించలేదు.ఒకవేళ ఈ ప్రాజెక్ట్ నిజంగానే జరిగే అవకాశం ఉంటే రాజమౌళి మాటల్లో చెప్పేవారు.
2023లో అల్లు అర్జున్ తో రాజమౌళి సినిమా అంటూ ఒక ప్రచారం జోరందుకుంది.అయితే రాజమౌళి దీని గురించి ప్రస్థావించలేదు అంటే ఆయన ప్రమేయం లేకుండానే ఈ వార్తలు వచ్చినట్టు అర్ధమవుతుంది.
బహుశా ఇప్పుడప్పుడే ఆ సినిమా గురించి మాట్లాడాలని రాజమౌళి అనుకోవడం లేదేమో అని కొందరు అంటున్నారు.మహేష్ తర్వాత రాజమౌళి ఎవరితో సినిమా చేస్తాడు అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉంది.
మహేష్ సినిమా కూడా మల్టీస్టారర్ అంటూ వచ్చిన వార్తలపై స్పందించిన జక్కన్న మహేష్ సినిమా సోలో అంటూ చెప్పాడు. ఈ ఏడాది చివర్లో మహేష్ జక్కన్న సినిమా సెట్స్ మీదకు వెళ్లే ఛాన్సులు ఉన్నట్టు తెలుస్తుంది.







