ఉత్తరాది రాష్ట్రాల ఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీ ఇక ఇతర రాష్ట్రాల్లోనూ పాగా వేసేందుకు యత్నిస్తున్న విషయం విధితమే.ఈక్రమంలో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బలోపేతం కోసం నేతలు తహతహలాడుతున్నారు.
సీఎం కేసీఆర్ వ్యూహంనే అనుసరించి ఆయనకు చెక్ పెట్టాలని యోచిస్తున్నట్టు తెలిసింది.ఇందుకు తగ్గట్టు ప్రణాళికలతో ముందుకు సాగుతోందట.
దక్షిణాదిలో బీజేపీకి అనుకూలంగా మారుతున్న తెలంగాణ రాష్ట్రంలో ఈసారి ఎలాగైనా అధికార పీఠం దక్కించుకోవాలని ఇప్పటి నుంచే తెగ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది.ఈనేపథ్యంలో ఈనెల 22న అనంతగిరి కొండల్లో 200మంది నేతలతో బీజేపీ కీలక సమావేశం ఏర్పాటు చేయనుంది.
రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు, టీఆర్ఎస్‌ను అడ్డుకునేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై కార్యాచరణ సిద్ధం చేయనున్నారని టాక్.
సాధారణంగా ప్రతి ఎన్నికలోనూ కేసీఆర్ అనుసరించే వ్యూహాన్నే బీజేపీ అమలు చేయాలని భావిస్తోందట.ఎన్నికల వరకూ ఎదురు చూడకుండా ముందుగానే అభ్యర్థులను ప్రకటించి ప్రత్యర్థులను ఒత్తిడిలోకి నెట్టడం కేసీఆర్ వ్యూహం.2018లోనూ ఇదే వ్యూహంతో ప్రత్యర్థులపై పైచేయి సాధించిన విషయం విధితమే.ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులను ఖరారు చేసే లోపే కేసీఆర్ ఎన్నికల కదన రంగంలోకి దిగి దూసుకుపోయిన విషయం విధితమే.మళ్లీ ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతున్నారనేది టాక్.ఈ క్రమంలో కేసీఆర్ దూకుడుకు చెక్ పెట్టేందుకు బీజేపీ మాస్టర్ ప్లాన్‌తో సిద్ధమవుతుందని సమాచారం.ఇప్పటికే 60 నియోజకవర్గ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిందని తెలిసింది.
వారినే నియోజకవర్గ ఇన్‌చార్జీలుగా నియమించబోతున్నారని బోగట్టా.దీంతోనే తాము ఎన్నికలకు సిద్ధం అనే సంకేతాలు ఇచ్చి టీఆర్ఎస్‌ను ఇరకాటంలో పెట్టేందుకు ప్లాన్ చేస్తోందట.

అయితే ఢిల్లీ నేతలు అమిత్‌షా వంటి వారు తెలంగాణ బీజేపీ నేతలకు రోడ్ మ్యాప్ ఇవ్వనున్నారనే ప్రచారం జరుగుతోంది.దీనికి తగ్గట్టే బీజేపీ నాయకత్వం ముందుకు సాగనుందని తెలిసింది.మొత్తానికి వచ్చే ఎన్నికల నాటికి టీఆర్ఎస్‌కు పోటీ ఇచ్చేందుకు బీజేపీ మాస్టర్ ప్లాన్‌తో రెడీ అవుతోందని అర్థం చేసుకోవచ్చు.ముఖ్యంగా అధికార పార్టీపై అసంతృప్తితో ఉన్న వర్గాలను ఆకర్షించేందుకు పావులు కదిపేందుకు యత్నిస్తున్నదని రాజకీయ విశ్లేషకుల అంచనా.
మరి తెలంగాణలో బీజేపీ వ్యూహం ఎలాంటి ఫలితాలు ఇస్తుందో వేచి చూడాలి.







