గుడివాడ మునిసిపల్ మాజీ వైస్ చైర్మన్ దివంగత అడపా బాబ్జి భౌతిక కాయానికి నివాళులర్పించిన పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని, ఎంపీ వల్లభనేని బాలశౌరి, జడ్పీ చైర్మన్ ఉప్పాల హారిక, పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధ, జిల్లాలోని పలువురు ప్రజాప్రతినిధులు.బాబ్జి అంతిమయాత్రలో పాల్గొన్న మంత్రులు కొడాలి , పేర్ని పలువురు ప్రజాప్రతినిధులు.
బాబ్జి మృతికి సంతాపంగా గురువారం పట్టణంలో మూసివేసిన వ్యాపార దుకాణాలు, వాణిజ్య సముదాయాలు.బాబ్జి ను గుడివాడ మునిసిపల్ చైర్మన్ గా చూస్తాను అనుకున్న దురదష్టవశాత్తూ ఆయన అకాల మృతి బాధాకరం -ఎంపీ వల్లభనేని బాలశౌరి.
మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ సోదరుడు,మంచి మిత్రుడిని కోల్పోయాను.గుడివాడలో ఎవ్వరితో విభేదాలు లేకుండా,పట్టణానికి సేవలు అందించిన విలక్షణ వ్యక్తి బాబ్జి.
బాబ్జి కుటుంబానికి వ్యక్తిగతంగా, పార్టీ పరంగా అండగా ఉంటాం, తాను తన కుటుంబ సభ్యుడిని కోల్పోయాను.మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ స్వార్థ చింతన లేకుండా నిస్వార్థ రాజకీయాలు చేసిన బాబ్జి గొప్ప వ్యక్తి.
విలువలకు కట్టుబడే బాబ్జి లాంటి నాయకులు అరుదుగా ఉంటారు.మంచి ఆత్మీయుడిని కోల్పోయాం,కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాం.
పార్టీ ఓ మంచి నాయకుడిని కోల్పోయింది – జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పాల హారిక.