చాలా సంవత్సరాల క్రితం చిరంజీవి ఎవరో తెలియదని జూనియర్ ఎన్టీఆర్ చెప్పారని ఒక వార్త నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే.ఎన్టీఆర్ అలా అన్నారని ఆధారాలు లేకపోయినా ఆ సమయంలో ఒక వెబ్ సైట్ లో ఈ వార్తను ప్రచురించడంతో ఈ వార్త గురించి జోరుగా ప్రచారంలోకి వచ్చింది.
చాలా మంది మెగాభిమానులు సైతం ఈ వార్త నిజమేనని నమ్మారు.అయితే అటు చిరంజీవి కానీ ఇటు తారక్ కానీ ఈ వార్త గురించి స్పందించ లేదు.
అయితే దర్శకుడు గీతాకృష్ణ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ చిరంజీవిపై చేసిన కామెంట్లకు సంబంధించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.చిరంజీవి నామస్మరణ చేసిన అల్లు కుటుంబం ఆ బ్రాండ్ నుంచి బయటకు రావాలని ట్రై చేస్తున్నారని యాంకర్ అడగగా గీతాకృష్ణ మాట్లాడుతూ వాళ్ల మనసులో ఏముందో వాళ్ల ఇంటికి వెళ్లి భోజనం చేస్తే తప్ప తెలియ దని అన్నారు.

33 సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్ తన దగ్గరకు రాగా పవన్ కు చిరంజీవిని ఇమిటేట్ చేయొద్దని చెప్పానని గీతా కృష్ణ అన్నారు.వెంకటేష్ చూడటానికి చిరంజీవిలా కనిపించడం తో ఇద్దరు చిరంజీవిలు ఇండస్ట్రీకి అవసరం లేదని చిరంజీవిని ఇమిటేట్ చేయొద్దని చెప్పానని గీతాకృష్ణ చెప్పు కొచ్చారు.జూనియర్ ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ లా యాక్ట్ చేయలేదని సీనియర్ ఎన్టీఆర్ తో పోలిస్తే జూనియర్ ఎన్టీఆర్ బెటర్ యాక్టర్ అని గీతాకృష్ణ తెలిపారు.

జూనియర్ ఎన్టీఆర్ సకల కళా వల్లభుడు అని ఆయన అన్నారు.జూనియర్ ఎన్టీఆర్ పాడ గలడని, డ్యాన్స్ చేయగలడని, ఎక్కువ మాట్లాడ తాడని అయితే ఎక్కువ మాట్లాడొద్దని చెప్పడంతో ఇప్పుడు ఎక్కువగా మాట్లాడటం లేదని గీతా కృష్ణ వెల్లడించారు.ఒక ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ చిరంజీవి అంటే తెలియ దని అన్నాడని నాగార్జున ఎన్టీఆర్ ను కరెక్ట్ చేశాడని గీతాకృష్ణ తెలిపారు.
జూనియర్ ఎన్టీఆర్ అలా అనడంతో రెండు మూడు సినిమాలు పోయాయని గీతాకృష్ణ పేర్కొన్నారు.







