ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో .పుతిన్‌ను నిలువరించేందుకు అమెరికా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే.
ఎన్ని రకాల ఆంక్షలు విధించినా రష్యా మాత్రం దాడిని ఆపడం లేదు.మరోవైపు రష్యా సేనలను విరోచితంగా ప్రతిఘటిస్తున్న ఉక్రెయిన్‌కు అమెరికా అన్ని రకాల ఆయుధాలను అందజేస్తోంది.
వీటి సాయంతోనే ఉక్రెయిన్ సైన్యం .రష్యాను అడ్డుకో గలుగుతోంది.ఇదే సమయంలో అమెరికన్లు సైతం .ఉక్రెయిన్‌కు అండగా నిలుస్తున్నారు.ముఖ్యంగా కాలి ఫోర్నియా నుంచి న్యూయార్క్ వరకు ఎన్నికైన ప్రజా ప్రతినిధులు, ఎన్జీవో సంస్థలు, స్థానిక గన్ వ్యాపారులు.ఉక్రెయిన్ కోసం బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, మిలియన్ రౌండ్ల మందు గుండు సామాగ్రిని సేకరిస్తున్నట్లుగా అమెరికన్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
మిగిలి పోయిన బాలిస్టిక్ హెల్మెట్‌లు, ఇతర పరికరాలను విరాళంగా ఇవ్వాలని కోరుతూ పోలీసులు, షెరీఫ్ విభాగాలను కొలరాడో గవర్నర్ జారెడ్ పోలీస్ గతవారం అవగాహనా కార్యక్రమాన్ని ప్రారంభించారు.పుతిన్‌ను నిలువరించేందుకు, ఉక్రెయిన్‌ను రక్షించడానికి ఇది అత్యవసరంగా ఉపయోగ పడుతుందని జారెడ్ అభిప్రాయ పడ్డారు.
ఆయన పిలుపునకు అద్భుతమైన స్పందన వచ్చింది.స్వల్ప వ్యవధి లోనే కొలరాడో లోని 25కి పైగా రాష్ట్రాలా ఎన్‌ఫోర్స్‌మెంట్ సంస్థలు.1000కి పైగా హెల్మెట్‌లు, 840 బాడీ ఆర్మర్‌లను అందించి నట్లు కొలరాడో ప్రభుత్వ యంత్రాంగం తెలిపింది.
ఇకపోతే.
వెస్ట్ వర్జీనియా గవర్నర్ జిమ్ జస్టిస్ సైతం.వెస్ట్ వర్జీనియా నేషనల్ గార్డ్ , డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్ లాండ్ సెక్యూరిటీ, వెస్ట్ వర్జీనియా లా ఎన్‌ఫోర్స్ మెంట్‌ను మిగిలి పోయిన బాడీ ఆర్మర్‌లను అందించాలని కోరారు.
అలాగే అమెరికా వ్యాప్తంగా వున్న గన్ బిజినెస్, ఎన్జీవోలు కూడా టాక్టికల్ గేర్‌ను అందిస్తున్నాయి.ఈ క్రమంలోనే ఫ్లోరిడాకు చెందిన అడ్రియన్ కెల్‌గ్రెన్ కుటుంబ యాజమాన్యంలోని తుపాకీ కంపెనీ.400 సెమీ ఆటోమేటిక్ రైఫిల్స్‌ను ఉక్రెయిన్‌కు పంపింది.దీని ద్వారా అపార్ట్ మెంట్లు, పాఠశాలలు, ఆసుపత్రులపై షెల్లింగ్‌కు పాల్పడుతోన్న రష్యా సేనలను ప్రతి ఘటించ వచ్చని అడ్రియన్ అంటున్నారు.

ఇకపోతే.పౌరులకు ఆయుధాలను అందిస్తామన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ వాగ్థానానికి ప్రతి స్పందనగా .అమెరికాలోని తుపాకీ తయారీ దారుల సమూహ మైన నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫౌండేషన్ స్పందించింది.ఈమేరకు వాషింగ్టన్‌లోని ఉక్రెయిన్ ఎంబసీ కోరిన స్నిపర్ రైఫిల్స్, పిస్టల్స్, మందు గుండు సామాగ్రిని ఎలా ఎగుమతి చేయాలో తన సభ్యులకు వివరించింది.
అలాగే ఈ ఆయుధ సంపత్తిని అంతర్జాతీయ స్థాయిలో ఎలా ఎగుమతి చేయాలో, అందుకు పూర్తి చేయాల్సిన చట్ట బద్ధ లాంచనాలపై కూడా సూచనలు చేసింది.







