తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా బిగ్ బాస్ షో ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్న సంగతి తెలిసిందే.హిందీలో బిగ్ బాస్ సీజన్ 15 చూసిన వాళ్లకు తేజస్వి ప్రకాశ్, కరణ్ కుంద్రా జోడీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
బిగ్ బాస్ హౌస్ లో ప్రేమలో పడిన ఈ జోడీకి ఎంతోమంది అభిమానులు ఉన్నారు.బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కరణ్ కుంద్రా, తేజస్వి ప్రకాష్ వరుస ఆఫర్లతో బిజీ అయ్యారు.
కొన్ని రోజుల క్రితం కరణ్ కుంద్రా తన తల్లీదండ్రులతో కలిసి తేజస్వి ప్రకాశ్ ఇంటికి వెళ్లి నుదుటిపై కుంకుమతో బయటకు వచ్చారు.పెళ్లిని అధికారికంగా నిశ్చయించు కోవడానికి ఉత్తరాది ప్రజలు చేసుకునే వేడుకను రోకా అంటారు.
కరణ్ అలా రావడంతో ఈ జోడీకి రోకా అయిందని నెటిజన్లు ఫిక్స్ అయ్యారు.ప్రస్తుతం తేజస్వి ప్రకాశ్, కరణ్ కుంద్రా ఆఫర్లతో బిజీగా ఉండటంతో వీళ్లిద్దరికీ ఇప్పట్లో పెళ్లి జరగదని అభిమానులు భావిస్తుండటం గమనార్హం.
అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో కరణ్ కుంద్రా చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.
కరణ్ కుంద్రా తాను మంచి భర్తగా ఉంటానో లేదో చెప్పలేనని అయితే మంచి తండ్రిగా మాత్రం ఉంటానని చెప్పుకొచ్చారు.

పెళ్లి జరిగిన తర్వాత తనకు ఆడపిల్ల పుట్టాలని కోరుకుంటున్నానని ఆయన వెల్లడించారు.తనకు, కాబోయే భార్యకు ఏకంగా 25 మంది పిల్లల్ని కనాలని ఉందని కరణ్ కుంద్రా చెప్పుకొచ్చారు.కరణ్ కుంద్రా ప్రస్తుతం లాకప్ షోలో పాల్గొని ఆ షోతో బిజీగా ఉన్నారు.

తేజస్వి ప్రకాశ్ ప్రస్తుతం నాగిని 6 సీరియల్ లో నటిస్తూ ఆ సీరియల్ తో బిజీగా ఉండటం గమనార్హం.కరణ్ కుంద్రా ఏకంగా 25 మంది పిల్లల్ని కనాలని ఉందని చెప్పడంతో నెటిజన్లు అవాక్కవుతున్నారు.







