మరో ఇండో అమెరికన్‌ని కీలక పదవికి నామినేట్ చేసిన జో బైడెన్..!!

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కొలువులో భారత సంతతికి చెందిన వ్యక్తులు కీలక పదవులు నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే ఈ లిస్ట్ భారీగా పెరిగిపోగా… అయినప్పటికీ బైడెన్ వెనక్కి తగ్గడం లేదు.

 Us President Biden Nominates Indian-american Diplomat Puneet Talwar As His Envoy-TeluguStop.com

తాజాగా ఇండో అమెరికన్ దౌత్యవేత్త పునీత్ తల్వార్‌ను మొరాకోకు అమెరికా రాయబారిగా నామినేట్ చేశారు.ప్రస్తుతం స్టేట్ డిపార్ట్‌మెంట్‌లో సీనియర్ సలహాదారుగా ఉన్న తల్వార్.

వైట్‌హౌస్, సెనేట్‌లో జాతీయ భద్రత ,విదేశాంగ విధానానికి సంబంధించి పలు హోదాల్లో పనిచేశారు.

గతంలో రాజకీయ-సైనిక వ్యవహారాల సహాయ కార్యదర్శిగా, అధ్యక్షుడికి ప్రత్యేక సహాయకుడిగా, జాతీయ భద్రతా మండలిలో సీనియర్ డైరెక్టర్‌గానూ పునీత్ విధులు నిర్వహించారు.

సెనేట్‌లోని విదేశీ సంబంధాల కమిటీలో సీనియర్ ప్రొఫెషనల్ స్టాఫ్ సభ్యుడిగా కూడా వ్యవహరించారు.అంతేగాక పబ్లిక్ సర్వీస్‌లో యూఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, స్టేట్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన పాలసీ ప్లానింగ్ స్టాఫ్‌లో కూడా తల్వార్ కీలక పాత్ర పోషించారు.

కార్నెల్ యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్‌లో బీఎస్ డిగ్రీ, కొలంబియా విశ్వ విద్యాలయం నుండి ఇంటర్నేషనల్ అఫైర్స్‌లో ఎంఏ పట్టాను పొందారు.అలాగే కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్ అండ్ నేటివ్ ఆఫ్ వాషింగ్టన్ డీసీ సభ్యుడిగా కూడా పునీత్ ఉన్నారు.

Telugu Boston, Chicago, Cincinnati, Indoamerican, York, Shefalirazdan-Telugu NRI

ఇకపోతే గత వారం భారత సంతతికే చెందిన రాజకీయ కార్యకర్త షెఫాలీ రజ్దాన్‌ దుగ్గల్‌ను నెదర్లాండ్స్‌లో అమెరికా రాయబారిగా జో బైడెన్ నామినేట్ చేసిన సంగతి తెలిసిందే.కాశ్మీర్ నుంచి యూఎస్‌‌కి వలస వచ్చిన దుగ్గల్ (50) సిన్సినాటీ, చికాగో, న్యూయార్క్, బోస్టన్‌లలో పెరిగారు.దుగ్గల్ సహా పలు దౌత్య పదవులకు సంబంధించి వైట్‌హౌస్ గత శుక్రవారం ప్రకటన చేసింది.ఇద్దరు పిల్లలకు తల్లి అయిన షెఫాలీ రాజకీయ కార్యకర్త,  మహిళా హక్కుల న్యాయవాది, మానవ హక్కుల ప్రచారకర్త అని వైట్‌హౌస్ తెలిపింది.

ఆమె యునైటెడ్ స్టేట్స్ హోలోకాస్ట్ మెమోరియల్ మ్యూజియం కౌన్సిల్‌కు అధ్యక్షురాలిగా పనిచేశారు.ప్రస్తుతం వెస్ట్రన్ రీజినల్ అడ్వైజర్‌‌గా కొనసాగుతున్నారు.హ్యూమన్ రైట్స్ వాచ్ శాని ఫ్రాన్సిస్కో కమిటీ, వేక్ ఫారెస్ట్ యూనివర్సిటీ లీడర్‌ షిప్ అండ్ క్యారెక్టర్ కౌన్సిల్‌ సభ్యురాలిగా పనిచేశారు.న్యూయార్క్ యూనివర్సిటీ నుంచి పొలిటికల్ కమ్యూనికేషన్‌లో ఎంఏ .మియామీ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ కూడా చదివారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube