తన ఫేవరెట్ కారును వ్యాపారవేత్తకు అమ్మేసిన ప్రియాంక చోప్రా.. ఎన్ని కోట్లంటే?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన ప్రియాంక చోప్రాకు ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉందనే సంగతి తెలిసిందే.ఒక్కో సినిమాకు ప్రియాంక చోప్రా కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.

 Priyanka Chopra Sells Her Rolls Royce Ghost Businessman Deets Inside Details, Pr-TeluguStop.com

వరుసగా హాలీవుడ్ ఆఫర్లను సొంతం చేసుకుంటున్న ప్రియాంక చోప్రాకు ఊహించని స్థాయిలో పాపులారిటీ ఉంది.అయితే తాజాగా ప్రియాంక చోప్రా తన ఫేవరెట్ కారును విక్రయించడం ద్వారా వార్తల్లో నిలిచారు.

ప్రియాంక చోప్రా తన ఫేవరెట్ కారును ఏకంగా రెండున్నర కోట్ల రూపాయలకు విక్రయించారని తెలుస్తోంది.ప్రస్తుతం సిటాడెల్ పేరుతో తెరకెక్కుతున్న అమెజాన్ ప్రైమ్ వీడియో సిరీస్ తో ప్రియాంక చోప్రా బిజీగా ఉన్నారు.

అయితే ప్రియాంక చోప్రా రోల్స్ రాయల్స్ కార్ ను అమ్మడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది.ప్రియాంక చోప్రా అమెరికాలో ఉండటంతో ఆమె రోల్స్ రాయిస్ కారు షెడ్ కే పరిమితమైంది.

అందువల్ల ఆ కారును ప్రముఖ వ్యాపారవేత్తకు ప్రియాంక చోప్రా అమ్మేశారు.ఇష్టంగా కొనుక్కున్న కారును ప్రియాంక చోప్రా అమ్మేయడంపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

Telugu Businessman, Deets, Hollywood, Priyanka Chopra, Priyankachopra, Rolls Roy

ఈ కారును కొనుగోలు చేసిన తొలి బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రానే కావడం గమనార్హం.ది మ్యాట్రిక్స్:​ రిసరెక్షన్స్ హాలీవుడ్ యాక్షన్ మూవీతో ప్రియాంక చోప్రా ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

ప్రియాంక చోప్రా హాలీవుడ్ లో కూడా సక్సెస్ కావడంతో ఆమె అభిమానులు చాలా సంతోషిస్తున్నారు.

Telugu Businessman, Deets, Hollywood, Priyanka Chopra, Priyankachopra, Rolls Roy

కెరీర్ లో ప్రియాంక చోప్రా ఎన్నో విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.ప్రీయాంక చోప్రా సినిమాలకు, వెబ్ సిరీస్ లకు రికార్డ్ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది.బాలీవుడ్ స్టార్ హీరోయిన్లను మించి ప్రియాంక చోప్రా రెమ్యునరేషన్ ఉండటం గమనార్హం.

ప్రియాంక చోప్రా కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube