కొల్లా ఏంటర్ టైన్మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్న ZEE 5 ఒరిజినల్ వెబ్ సిరీస్ షూటింగ్ లో జాయిన్ అయిన హీరో సుశాంత్..

మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు మనవడిగా కింగ్ నాగార్జున మేనల్లుడుగా “కాళిదాసు”చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైన యువ కథా నాయకుడు సుశాంత్.తను కెరీర్ మొదలుపెట్టిన తక్కువ సమయం లోనే కరెంట్, అడ్డా, దొంగాట, అటాడు కుందాం.రా , చి౹౹ల౹౹సౌ౹౹ వంటి మొదలగు హిట్ సినిమాలలో నటించి మాస్ ప్రేక్షకులకు దగ్గరయ్యారు.”అల వైకుంఠ పురములో“.సినిమాతో మంచి క్లాస్ క్యారెక్టర్ లో నటించి అక్కినేని అభిమానులతో పాటు క్లాస్, మాస్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాడు.కరోనా టైం లో ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’సినిమా ద్వారా మంచి విజయం సాధించి ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు.

 Sushanth Onboarded For Zee5s Original Web Series-TeluguStop.com

తాజాగా వెబ్ సిరీస్ ట్రెండ్ నడుస్తుండడంతో వెబ్ సిరీస్ లో ఏంతో ఆసక్తి కరమైన కథ సుశాంత్ కు నచ్చడంతో తొలిసారిగా “ZEE5” వెబ్ సిరీస్ ను సెలెక్ట్ చేసుకొని నటించడం విశేషం.ప్రస్తుతం ZEE5 లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ వెబ్ సిరీస్ ను కొల్లా ఏంటర్ టైన్మెంట్స్ పతాకంపై ప్రవీణ్ కొల్లా నిర్మిస్తున్నారు.

లక్ష్మి సౌజన్య దర్శకత్వం వహిస్తున్నారు.అటు సినిమాల్లో నటిస్తూనే.

ఇటు “ZEE5” వెబ్ సిరీస్ లో నటించ డానికి ముందుకు వచ్చిన సుశాంత్ ను ZEE 5 టీం గ్రాండ్ వెల్ కం చెపుతూ మా రాబోయే వెబ్‌సిరీస్‌కు స్వాగతం అంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

ఇప్పటి వరకు ప్రేక్షకులు సుశాంత్ ను పోలీస్ గెటప్ లో చూడలేదు.

పోలీస్ జీప్ ముందు మఫ్టీ లో కూల్ గా నిల్చొని చూస్తున్న ఫోటో ను చూస్తుంటే తను నటించే ZEE5 వెబ్ సిరీస్ లో ఒక పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడని తెలుస్తుంది.ఈ గెటప్ ను చూస్తుంటే తను నటించే ZEE5 వెబ్ సిరీస్ మీద విపరీతమైన ఆసక్తిని కలిగిస్తుంది.

ఈ నెల18 న జరిగే సుశాంత్ బర్త్ డే వేడుకలో సుశాంత్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ ను విడుదల చేస్తూ తను నటించే వెబ్ సిరీస్ గురించి పూర్తి వివరాలు తెలియజేస్తామని ZEE 5 యూనిట్ తెలియజేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube