శ్రీదేవి డ్రామా కంపెనీ ఒక ఎపిసోడ్ కి అయ్యే ఖర్చేంతో తెలుసా?

తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న కామెడీ షోస్ జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ కార్యక్రమాలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అద్భుతమైన కామెడీతో ప్రతివారం ప్రేక్షకులను ఎంతో ఎంటర్టైన్ చేస్తుంది.

 Do You Know The Cost Of Sridevi Drama Company Per Episode, Sri Devi Drama Compan-TeluguStop.com

ఇక ఈ కార్యక్రమానికి ఏ మాత్రం తీసిపోకుండా ఈటీవీలో శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమం ప్రసారం అవుతున్న సంగతి మనకు తెలిసిందే.అయితే జబర్దస్త్ కార్యక్రమంతో పోలిస్తే ఈ కార్యక్రమంలో ఎక్కువ మంది కంటెస్టెంట్ లు ఉంటారు.

ఇలా ప్రతి వారం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడం కోసం మల్లెమాల సంస్థ వారు ఈ కార్యక్రమానికి భారీ మొత్తంలో ఖర్చు చేస్తారని సమాచారం.

అయితే జబర్దస్త్ కార్యక్రమంతో పోలిస్తే ఈ కార్యక్రమానికి తక్కువ ఖర్చు అవుతుందని మల్లెమాల వారు తెలియజేస్తున్నారు.

జబర్దస్త్ కార్యక్రమంలో జడ్జిగా వ్యవహరిస్తున్న రోజా, మనో,యాంకర్ అనసూయ రష్మీ వంటి వారికి పెద్ద మొత్తంలో పారితోషికం చెల్లించాలని అందుకే జబర్దస్త్ కార్యక్రమానికన్నా శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి తక్కువ ఖర్చు అవుతుందని వెల్లడించారు.ఇక ఈ కార్యక్రమంలో పాల్గొనే కొంతమందికి మాత్రమే పారితోషికం చెల్లిస్తారు.

మిగతా వారందరు కూడా ఏలాంటి పారితోషికం లేకుండా కేవలం బుల్లితెరపై కనిపించడం కోసమే పనిచేస్తారు.

Telugu Cost, Sridevi, Sudheer, Tollywood-Movie

ఇలా ప్రతి వారం శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సుమారు 30 నుంచి 35 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది.ఇక ఏదైనా ప్రత్యేక కార్యక్రమం లేదా గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేస్తే 50 లక్షల వరకు ఖర్చు అవుతుందని మల్లెమాల వారు తెలియజేస్తున్నారు.ప్రొడక్షన్ కాస్ట్ కేవలం యూట్యూబ్ రెవిన్యూతోనే వస్తుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube