ఈ పక్షి తెలివికి ఎవరైనా సరే సలాం కొట్టాల్సిందే

తెలివి.ఈ పదాన్ని వింటే కొంత మందికి ఏదో బ్రహ్మపదార్థంలా అనిపిస్తుంటుంది.కానీ కొంత మంది మాత్రం చాలా లైట్ తీసుకుంటారు.చాలా మంది చూసేందుకు ఒకేలా ఉన్నా కానీ వారి తెలివితేటల్లో చాలా తేడాలుంటాయి.ఎక్కువ తెలివి ఉన్న వ్యక్తులు ఎటువంటి ఆటంకాలు లేకుండా దర్జాగా బతికితే.తక్కువ తెలివి ఉన్న వ్యక్తులు చాలా అవస్థలు పడుతుంటారు.

 Someone Has To Salute The Wisdom Of This Bird Bird, Talent, Viral Video, Intell-TeluguStop.com

తెలివి లేని వారు పడే అవస్థలను చాలా చూసే ఉంటాం.ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది.

ఈ వైరల్ వీడియోలో ఉన్న ఓ పక్షి తన తెలివితేటలను ప్రదర్శిస్తుంది.ఆ పక్షి యజమాని ఒక వస్తువును అక్కడ ఉంచుతాడు.

ఆ వస్తువు పై భాగంలో రకరకాల ఆకారాల్లో మూతలు ఉంటాయి.ఒక ఆకారంతో ఒక ఆకారానికి సంబంధం లేకుండా ఉంటుంది.

ఆ యజమాని మొదటే ఆ మూతలన్నీ తీసి వేరే చోట వేస్తాడు. ఆ పక్షికి ఆ మూతలను తీసుకొచ్చి సరైన సైజు ఉన్న బాక్సుల్లో వేసే పనిని అప్పగిస్తాడు.

ఈ పని మనుషులమైన మనకు వినేందుకు చాలా ఈజీగానే ఉన్నా కానీ పక్షులకు మాత్రం ఇది కఠిన పరీక్షే.కానీ ఇటువంటి పరీక్షలో కూడా ఓ పక్షి తన తెలివితేటలను ప్రదర్శించి నెగ్గుతుంది.

ఇలా పక్షి తన తెలివితేటలను చూపించిన తర్వాత ఆ వ్యక్తి ఆ పక్షికి బహుమానంగా కొన్ని గింజలను అందజేస్తాడు.ఆ పక్షి ఆ గింజలను చాలా ఫాస్ట్​ గా తింటుంది.

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.ఈ వీడియోను చూసిన చాలా మంది వీక్షకులు లైకులు, షేర్లు, కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.ఇప్పటికే ఈ వీడియోను 4.4M పై చిలుకు మంది వీక్షించారు.మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వైరల్ వీడియోను మీరు కూడా వెంటనే చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube