దుబాయిలో ఆర్ఆర్‌ఆర్‌ ఈవెంట్‌ ఎలా జరుగబోతుందంటే..!

టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వం లో తెరకెక్కిన ఆర్‌ఆర్‌ఆర్ సినిమా మార్చి 25 తారీకు న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ప్రపంచ వ్యాప్తంగా అత్యంత భారీ ఎత్తున ఈ సినిమాని విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటించారు.అమెరికా లో ఈ సినిమా ప్రీమియర్ ల ద్వారా ఏకంగా రెండు మిలియన్ల డాలర్ల ను వసూలు చేయబోతుంది అంటూ ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది.10 మిలియన్ల డాలర్ల వరకు వసూలు చేస్తోంది అంటూ అంత నమ్మకం గా ఉన్నారు.ఇక ఇతర దేశాల్లో ఈ సినిమా కు సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాల ను నిర్వహించాలనే ఉద్దేశం తో చిత్ర యూనిట్ సభ్యులు దుబాయ్ కి వెళ్లి అక్కడ భారీ ఈవెంట్‌ కు సిద్ధమయ్యారు.రేపు దుబాయ్ లో పెద్ద ఎత్తున నిర్వహించబోతున్న ప్రీ రిలీజ్ కార్యక్రమానికి అక్కడి తెలుగు వారు మరియు మీడియా సినీ వర్గాల వారు ఇతర ఇండియన్ సినీ ప్రేమికులు హాజరు కాబోతున్నారు.

 Rrr Event In Dubai Going To Big , Dubai, Rrr , Rrr Event, Rajamouli, Ram Chara-TeluguStop.com

దుబాయ్‌ లోని ప్రముఖ హోటల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నట్లు గా తెలుస్తుంది.ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన విషయాలను రాజమౌళి వెల్లడించడం తో పాటు ఎన్టీఆర్ మరియు రామ్‌ చరణ్ లు అక్కడి అభిమానుల తో ముచ్చటించబోతున్నారు.

దుబాయి లో ఈ సినిమా ను భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు.ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ ద్వారా పెద్ద ఎత్తున టికెట్లను అక్కడి వారు బుక్‌ చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

సినిమా ప్రభంజనం సృష్టించే విధంగా ఉంటుంది అంటూ చిత్ర యూనిట్ సభ్యులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

Telugu Ajay Devgan, Alia Bhatt, Jr Ntr, Rajamouli, Ram Charan, Rrr-Movie

సినిమా కు సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలను చాలా గ్రాండ్ గా నిర్వహించేందుకు ఇక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేయడం జరిగింది.గతంలో ఏ ఇండియన్ సినిమా విడుదల కాని విధంగా దుబాయ్ లో ఈ సినిమాను విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.రాజమౌళి ఏం చేసినా కూడా భారీగానే ఉంటుంది, కనుక దుబాయి లో కూడా అంతకు మించి అన్నట్లుగా వసూళ్లు ఉంటాయి అనే ఉద్దేశం తో చిత్ర యూనిట్ సభ్యులు మరియు ప్రేక్షకులు ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube