తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు బలపడటానికి పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే.అయితే పెద్ద ఎత్తున బలపడే పరిస్థితులు కొనసాగుతున్న క్రమంలో కాంగ్రెస్ లో జరుగుతున్న కీలక పరిణామాలతో మరో సారి కాంగ్రెస్ పార్టీ చర్చనీయాంశంగా మారిన పరిస్థితి ఉంది.
అయితే కాంగ్రెస్ పార్టీ లో ప్రజాస్వామ్యం ఎక్కువ అనే విషయం తెలిసిందే. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్యే కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ కు భారీ షాక్ ఇవ్వనున్నారనే ప్రచారం సాగుతోన్న తరుణంలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మరో సారి కాంగ్రెస్ పై చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి.
ఎవరి క్రింద పడితే వారి క్రింద పనిచేయనని, ఏ మాత్రం స్థాయి లేని వ్యక్తులు కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషిస్తూ మాపై పెత్తనం చేయడం ఏంటని కాంగ్రెస్ పార్టీలో ఇటువంటి నాయకత్వం ఉన్నంత కాలం కాంగ్రెస్ పుంజుకునే పరిస్థితి లేదని కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా రాజకీయ వర్గాలలో మరోసారి సంచలనంగా మారాయి.అంతేకాక పార్టీ మారబోతున్నారని జరుగుతున్న ప్రచారంపై స్పందించిన రాజగోపాల్ రెడ్డి పార్టీ మార్పుపై త్వరలోనే క్లారిటీ ఇస్తానని వ్యాఖ్యానించారు.
అయితే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై ఇటు కాంగ్రెస్ నేతలెవరూ స్పందించని పరిస్థితి ఉంది.అయితే కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాల పట్ల గతంలో యాక్టివ్ గా ఉన్న సీనియర్ నేతలెవరు కోమటిరెడ్డి బ్రదర్స్ లా స్పందించని పరిస్థితి ఉంది.
అయితే మరి అందరం ఒకటేననే సంకేతాలను రేవంత్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెబుతున్నా మరి కొద్ది రోజుల తరువాత ఇక స్వంత అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుండటంతో కాంగ్రెస్ పార్టీ అనేది పెద్ద ఎత్తున చర్చగా మారుతున్న పరిస్థితి ఉంది.