మల్కాజ్గిరి లోని యాప్రాల్ లో ఓ ఫంక్షన్ హాల్ కూల్చివేయడం తో ఫంక్షనల్ యజమానీ బిజెపి నాయకుడు రామచందర్ రావు ను ఆశ్రయించడంతో పూర్తి వివరాలు తెలియకుండానే ప్రెస్ మీట్ పెట్టి నోరు పారేసుకుని మైనంపల్లి ఖబర్దార్ అంటూ వ్యాఖ్యలు చేసిన రామచంద్రరావు.మైనంపల్లి హనుమంతరావు ఈరోజు కౌంటర్ ఇచ్చారు రామచంద్ర రావు గారికి నేను ఎంతో గౌరవం ఇస్తాను కానీ అనవసరమైన విషయాలలో తలదూర్చి లాండ్ మాఫియా కు సపోర్ట్ చేస్తూ రామచంద్ర రావు పూర్తి వివరాలు తెలిసికూడా అధికారులను తప్పు పడుతున్నారని మైనంపల్లి హెచ్చరించారు.
అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తున్న నన్ను పనులు నిలిచిపోయే విధంగా అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తున్నారని మైనంపల్లి హనుమంతరావు తెలిపారు.దమ్ముంటే మీరు నేను ఇద్దరం కలిసి మల్కాజ్గిరి ప్రాంతంలో పర్యటించి సమస్యలను పరిష్కరిస్తామని మైనంపల్లి వాపోయారు.
బీజేపీ నేతలపై మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘అభివృద్ధిని అడ్డుకుంటూ స్థానికులను రెచ్చగొడుతున్న బీజేపీ నేత రామచంద్రరావు గారు… కబ్జా స్థలాలు చేసిన వారికి సహకరిస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు దయచేసి మీరు అలాంటి వారిని ప్రోత్సహించకండి…ఎంతటి వారైనా సరే కబ్జా చేసిన వారిని వదిలిపెట్టం’’ అని హెచ్చరించారు.
ఇప్పటికే మల్కాజిగిరి నియోజకవర్గానికి తెలంగాణ ప్రభుత్వం అనేక నిధులను విడుదల చేసిందని తెలిపారు.స్థానిక ప్రజల సమస్యలపై చర్చించి పరిష్కరించడానికి ప్రజాదర్భార్‌ను ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే చెప్పారు.
నాగిరెడ్డి చెరువుపై కబ్జా చేసిన ఫంక్షన్ హల్ నిర్మాణాన్ని కూల్చేసినందుకే రామచంద్రరావు అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ’’నిజంగా నేను ఏదైనా తప్పు చేసినట్టు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా… మరి నేను మీరు చేసిన తప్పులను చూపిస్తే మీరేం చేస్తారు చెప్పండి.
నాపై ఖబడ్దార్ అనే ముందు ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాలి.మీకు నేను చాలా మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నాను రామచంద్రరావు గారు’’ అంటూ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పేర్కొన్నారు.







