టాలీవుడ్ స్టార్ హీరోయిన్, నేషనల్ క్రష్ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.చలో సినిమా తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పరుచుకుంది.
ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు మోస్ట్ లక్కీ హీరోయిన్ గా మారిపోయింది.ఇక ఇటీవలే పుష్ప సినిమాతో తన రేంజ్ ని మరింత పెంచుకుంది ఈ ముద్దుగుమ్మ.
పుష్ప సినిమాతో రష్మిక పాన్ లెవల్లో ఫాలోవర్స్ ను సంపాదించుకుంది.పుష్ప సినిమా తర్వాత ఆమెను ఫాలో అయ్యేవారి సంఖ్య మరింత పెరిగింది.
పుష్ప సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్న రష్మిక ప్రస్తుతం వరుసగా సినిమా అవకాశాలతో దూసుకుపోతోంది.ఈ క్రమంలోనే బాలీవుడ్ లో బడా ఆఫర్స్ వచ్చి చేరుతున్నాయి.మరొకవైపు టాలీవుడ్ లో కూడా మంచి మంచి ప్రాజెక్టులు వస్తున్నాయి.రష్మిక కూడా అందుకు అనుగుణంగానే ప్రతిరోజు జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ అందుకు సంబంధించిన ఫోటోలను వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ యూత్ ల గుండెల్లో అలజడి రేపుతోంది.
ఇదిలా ఉంటే ఈ బ్యూటీ రేంజ్ బాగా పెరిగిపోవడంతో.రష్మిక ను ఐటెం సాంగ్ కోసం సంప్రదించారు.
రష్మిక ఐటెం సాంగు కోసం ఏకంగా రెండు కోట్ల రూపాయలు అడిగిందట.

పుష్ప సినిమాలో సమంత ఐటమ్ సాంగ్ చేయడం ఆ సాంగ్ కాస్త బ్లాక్ బస్టర్ గా నిలిచి సమంతా కు విపరీతంగా క్రేజ్ వచ్చిన విషయం తెలిసిందే.రష్మిక కూడా ఫుల్ ఫామ్ లో ఉన్నందువల్ల ఐటమ్ సాంగ్ చేయడం కోసం ఏకంగా రెండు కోట్లు కావాల్సిందే అంటూ డిమాండ్ చేసిందట.అర్జున్ రెడ్డి ఫేమ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ తో కలసి యానిమల్ మూవీ చేస్తున్నాడు.
ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ కోసం ఆమెను సంప్రదించగా అందుకు రష్మిక 2 కోట్లు రెమ్యూనరేషన్ ను డిమాండ్ చేసిందట.ఇందుకు సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఇకపోతే రష్మిక మందన ఇటీవలే ఆడవాళ్ళు మీకు జోహార్లు సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం అందరికి తెలిసిందే.







