ముఖ్య అతిథిగా జనసేన చేనేత వికాస విభాగం చైర్మన్ చిల్లపల్లి శ్రీ నివాసరావు పాల్గొన్నారు తమ గ్రామంలో జనసేన ఆవిర్భావ సభ ద్వార మా గ్రామానికి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చినందుకు జనసేన ట్రస్ట్ ద్వారా 50 లక్షల రూపాయలు మా గ్రామానికి విరాళంగా ఇచ్చినందుకు కృతజ్ఞతగా పవన్ కళ్యాణ్ చిత్ర పటానికి పాలాభిషేకం చేసారు కమిటీగా ఏర్పడి ఈ నిధులను గ్రామం లోని అభివృది పనులకు కేటాయిస్తామని తెలిపారు ఈ గ్రామానికి 50 లక్షల రూపాయల విరాళం కేటాయించి పవన్ కళ్యాణ్ ప్రేమతో ఓట్లు అడిగే విధానానికి నాంది పలికారని చిల్లపల్లి శ్రీనివాసరావు అన్నారు.







