సోషల్ మీడియాలో మనం ఎన్నో వీడియోలు చూస్తుంటాం.కాలక్షేపం కోసం ఫన్నీ వీడియోలు, జంతువులకు సంబంధించిన వీడియోలను చూసి రిలాక్స్ అవుతుంటాం.
మూగ జీవాలు చేసే అల్లరి, అవి చూపించే ప్రేమ, వాటి ఆటలు ఇలా ఏవి చూసినా చూడముచ్చటగా అనిపిస్తుంది.ఇక చిన్నచిన్న జంతువులు చేసే చేష్టలు ఎంతలా హత్తుకుపోతాయో తెలిసిందే.
తాజాగా అలాంటి క్యూట్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.దీనిని చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
సాధారణంగా పిల్లి ఏం చేసినా క్యూట్‌గా ఉంటుందంటారు క్యాట్ లవర్స్.కానీ, దొంగలా పాలు తాగి ఏమీ ఎరగనట్టు నటించే ఆ మూగజీవిని మరికొందరు చూస్తే చిర్రెత్తిపోతారు.
అయితే ఇక్కడ ఓ క్యూట్ పిల్లి ఎలాంటి దొంగ వేషాలు వేయకుండా టైపింగ్ చేస్తుంది.అదీ ఎంత స్పీడ్ అంటే చెప్పలేం ? అందుకే ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.మరి ఆ వీడియోలో ఏముందో చూద్దామా ?
సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా యోగ్ ఖాతా ద్వారా ఈ క్యూట్ పిల్లి వీడియో పోస్ట్ చేయగా తెగ వైరల్ అవుతోంది.ఈ వీడియోలో పిల్లి యజమాని ఒక కీబోర్డు చిత్రం ఉన్న బ్యాగ్‌ను పిల్లి ముందు ఉంచుతాడు.
అది చూసిన ఈ క్యూట్ పిల్లి వెంటనే తన చేతులతో టైపింగ్ చేసినట్టు చేతులను ఆడిస్తుంది.అది ఎలా అంటే మామూలుగా కాదు.

రన్నింగ్ రేస్‌లో గుర్రం పరిగెత్తేలా.చేతులతో కీబోర్డును యమ స్పీడ్‌గా టైప్ చేస్తుంది.ఇది చూసినంత సేపు ఇదేంటి పిల్లి ఇంత వేగంగా నిజంగా టైప్ చేస్తుందా ? అని అనిపించక మానదు.దాని స్పీడుకు వీడియో చూసే వారి కండ్లే షాక్ అవుతాయి.
ఆ రేంజ్‌లో ఈ క్యూట్ పిల్లి టైపింగ్ చేసిందన్నమాట.ఇది చూడడానికి విడ్డూరంగా ఉన్నా.
నెటిజన్లను మాత్రం తెగ ఆకట్టుకుంటోంది.దీనికి మౌస్‌తో పనిలేదని ఒకరు, ఇది 150 వర్డ్స్ టైపింగ్ చేస్తుంది అంటూ తెగ కామెంట్ చేస్తున్నారు.
మీరూ ఈ వీడియో చూసి రిలాక్స్ అవ్వండి.







