నందమూరి బాలకృష్ణ అఖండ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే.బోయపాటి శ్రీను తెరకెక్కించిన అఖండ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని భారీ వసూళ్లు కూడా రాబట్టి చాలా రోజుల తర్వాత మంచి విజయం దక్కడంతో ఆనందంగా ఉన్నారు.
ఈ సినిమా సూపర్ హిట్ అందుకున్న ఖుషీలో బాలయ్య తన తర్వాత సినిమా కూడా స్టార్ట్ చేసారు.
యాక్షన్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య 107 వ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది.
గోపిచంద్ మలినేని క్రాక్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు.ఇక ఇప్పుడు ఈ మాస్ వ్యక్తులు ఇద్దరు రంగంలోకి దిగడంతో సినిమా ఎలా ఉండ బోతుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
భారీ యాక్షన్ సీక్వెన్స్ తో ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ మొదలు పెట్టారు.

అయితే లొకేషన్ ఫోటో లీక్ అవ్వడంతో బాలయ్య లుక్ బయటకు వచ్చింది.దీంతో మేకర్స్ ఫస్ట్ లుక్ కూడా విడుదల చేసారు.తాజాగా మరొక పాత్ర కూడా రివీల్ చేసారు మేకర్స్.
ఈ సినిమాలో శాండిల్ వుడ్ స్టార్ దునియా విజయ్ కూడా కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.అయితే తాజాగా దునియా విజయ్ పాత్ర ను రివీల్ చేసారు.
ఈ సినిమాలో ఈయన విలన్ పాత్రలో నటిస్తున్నాడు.
తాజాగా మేకర్స్ ఈయన లుక్ రివీల్ చేస్తూ విజయ్ ముసలి మడుగు ప్రతాప్ రెడ్డి పాత్రలో నటిస్తున్నాడు అంటూ విజయ్ లుక్ ను సోషల్ మీడియా వేదికగా రివీల్ చేసారు.
ఈయన లుక్ చూసి నందమూరి అభిమానూలు తెగ ఆనంద పడిపోతున్నారు.బాలయ్యకు సరైన విలన్ దొరికాడని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మరి ఈ కన్నడ స్టార్ విలన్ పాత్రలో ఎంత జీవించి నటిస్తాడో చూడాలి.ఇక ఈ సినిమాలో శృతి హాసన్ నటిస్తుండగా.
వేటపాలెం అనే టైటిల్ ను అనుకుంటున్నట్టు సమాచారం.







