జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి నానాటికీ గడ్డుపరిస్థితులు ఎదురవుతున్నాయా ? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.ప్రతి ఎన్నికలోనూ ఓటమి చవిచూడాల్సిన దుస్థితి వస్తోంది.
ఇటీవల ఉత్తరాది ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం చవిచూసింది.దీంతో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి పునరాలచనలో పడ్డారు.
పార్టీలో నూతనోత్తేజం తీసుకొచ్చేందుకు కొన్ని పనులు చేయలని భావిస్తోందట.అవిగాని సత్ఫలితాలిస్తే పర్వాలేదు.
కానీ, బెడిసికొడితే మాత్రం ఉన్న కాస్త కాంగ్రెస్ వెలుగు మసకబారక తప్పదు.అయితే యువశక్తిని కాంగ్రెస్ దూరం చేసుకోవడంతోనే పార్టీకి ఇలాంటి పరిస్థితి దాపురించింది.
అయినా సోనియా మాత్రం ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నారు.ఒకవిధంగా చెప్పాలంటే ఉత్తరాదిలో ఓటమి కాంగ్రెస్‌కు కొత్త పాఠాలు నేర్చుకునేలా చేశాయనడంలో సందేహం లేదు.
ఇలా ఓటమి, మరోవైపు నైరాశ్యం చెందిన వేళ సోనియా అనూహ్య నిర్ణయాలు తీసుకోవడం విశేషం.
తాజాగా ఐదు రాష్ట్రాలకు చెందిన పీసీసీ చీఫ్‌లను మార్చేయాలని సోనియా సంకల్పించింది.
అనుకున్నదే తడువుగా నేటి వరకు ఉన్న పీసీసీ చీఫ్‌లను తప్పించే పనిలో పడ్డారు.దీని ఫలితం ఎలా ఉంటుందనేది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
ఉత్తారాదిలో కాంగ్రెస్ ఓటమి దెబ్బకు సోనియా తీవ్రంగా స్పందించిందని అర్థం చేసుకోవచ్చు.ఇతర రాష్ట్రాలు మణిపూర్, ఉత్తరాఖండ్‌లో కూడా కాంగ్రెస్ ఆశించిన ఫలితాలు రాబట్టలేదు.

ఒకవిధంగా చెప్పాలంటే ప్రజల నాడి తెలుసుకోకుండానే కాంగ్రెస్ నేతలు పనిచేస్తున్నారా ? అనే భావన కలుగక మానదు.ఎట్టకేలకు సోనియా స్పందించి ఓటమి కారణాలు తెలుసుకునే పనిలో భాగంగా ఆమె పీసీసీ చీఫ్‌లను మార్చాలని నిర్ణయించడం విశేషం.ఇది భవిష్యత్‌లో కాంగ్రెస్ పార్టీకి కొత్త శక్తుల తోడు సహకరిస్తుందా ? అనేది ప్రశ్నార్థకమే.ఏది ఏమైనా చావు అంచులోకొచ్చిన కాంగ్రెస్‌లో జోష్ తెచ్చేందుకు సోనియా తీసుకున్న నిర్ణయం సత్ఫలితాలిస్తుందా ? లేదా అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.







