పీఎఫ్ అకౌంట్ హోల్డర్లకు గవర్నమెంట్ గుడ్ న్యూస్.. ఆ డబ్బులు డబుల్..?

పీఎఫ్ సబ్‌స్క్రైబర్లకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించనుందా? త్వరలోనే రూ.1000 పెన్షన్ డబుల్ కానుందా? అని అడిగితే అవుననే సమాధానం వినిపిస్తోంది.ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ పెన్షన్ స్కీమ్ చందాదారులకు ఎప్పటినుంచో నెలకి కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే అందిస్తోంది.అయితే ఈ రోజుల్లో 1000 రూపాయలతో నెల గడవడం అసాధ్యం.

 Is Pension Amount Going To Double Pf Account Holders Details, Pf Account, Holde-TeluguStop.com

ఈ విషయాన్ని గుర్తించిన పార్లమెంటు కమిటీ పింఛన్ డబ్బుల మొత్తాన్ని పెంచాల్సిందిగా కార్మిక మంత్రిత్వ శాఖకు సజెస్ట్ చేసింది.అంతేకాదు పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ మోడీ సర్కార్ కు ఓ నివేదిక కూడా అందజేసింది.

ఇందులో పీఎఫ్ పింఛను పెంచాల్సిన అవసరం ఉందని స్టాండింగ్ కమిటీ పేర్కొంది.

అయితే ఈ పింఛన్ మొత్తం ఎంత పెంచితే బాగుంటుందో తెలియజేసేందుకు నిపుణుల అభిప్రాయాలు తీసుకోవాల్సిందిగా కోరింది.

అలాగే ఆర్థిక శాఖ నుంచి పర్మిషన్ తీసుకుని అవసరమైన బడ్జెట్‌ను అలొకేట్ చేయాల్సిందిగా కోరింది.

Telugu Epfo, Ministry, Employees, Holders, India, Amount, Pf, Pf Holders-Latest

2014వ సంవత్సరంలో పీఎఫ్ పెన్షన్‌ను రూ.1000గా నిర్ణయించారు.ఆ సమయం నుంచి దీన్ని పొడిగించిన దాఖలాలు లేవు.

అయితే అప్పటికీ ఇప్పటికీ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి.దీనివల్ల ఇప్పుడు కూడా వెయ్యి రూపాయల పెన్షన్ అందించడం సరైంది కాదని పార్లమెంటు స్టాండింగ్ కమిటీ చెబుతోంది.

దీనిపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి.గతంలో ఒక కమిటీ పింఛన్ మొత్తాన్ని రూ.2 వేలకు పెంచాలని రికమండ్ చేసింది.కానీ ఆర్థిక మంత్రిత్వ శాఖ అందుకు అంగీకరించకుండా మినిమమ్ పెన్షన్‌ను రూ.1000గానే కంటిన్యూ చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube