ఎలుక అన్నింటినీ ఎందుకు కొరుకుతుంది? అలా చేయ‌కుండా ఎందుకు ఉండ‌లేదంటే...

ఎలుకను గణేశుడి వాహ‌నంగా భావిస్తారు.అయితే మన ఇళ్లలో ఎలుకలు ఉండటం ఎవ‌రికీ అస్సలు ఇష్టం ఉండదు.

 Why Does A Rats Gnaw On Everything, Rats , Rats Gnaw , Teeth , Teeth Grow , Pa-TeluguStop.com

ఇళ్లలో ఎలుకల ఉనికిని ఇష్టపడకపోవడానికి అనేక కారణాలున్నాయి.కొన్నిసార్లు ఎలుకలు విలువైన వస్తువులను కూడా కొరుకుతాయి.

ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఎలుకలు త‌మ‌కు హాని చేసే వాటిని కొర‌క‌వు.ఇంత‌కీ ఎలుక‌లు ఎందుకు అన్నింటినీ ఎందుకు కొరుకుతాయి? అలా చేయ‌కుండా ఎందుకు ఉండ‌లేవో ఇప్పుడు తెలుసుకుందాం.మనుషులు.ఎలుకల దంతాల మధ్య చాలా వ్యత్యాసం ఉంది.మానవ దంతాలు ఒక సమయం వ‌చ్చేస‌రికి పెరగడం ఆగిపోతాయి.అంటే ఒక నిర్దిష్ట సమయం తర్వాత మ‌నిషి దంతాల ఆకృతిలో ఎటువంటి మార్పు ఉండదు.

కానీ ఎలుకల దంతాలు మన దంతాల కంటే చాలా భిన్నంగా ఉంటాయి.ఎలుకల దంతాలు ఎప్పుడూ పెరుగు తూనే ఉంటాయి.

అవి దంతాల పరిమాణాన్ని అదుపులో ఉంచు కోవడానికి అవి రక రకాలుగా కొరుకుతూ ఉంటాయని తెలిస్తే ఆశ్చర్యం క‌లుగు తుంది.ఎలుకలు వాటి పళ్లను ఆహారం తినడానికి మాత్రమే ఉపయోగిస్తాయి.

ఇలా అవి కొరుకుకోకపోతే వాటి దంతాలు చాలా పెద్దవిగా మారతాయి.అప్పుడు అవి నోరు మూసు కోలేవు.

ఎలుక పళ్ళు చాలా బలంగా ఉంటాయి.అందుకే అవి గోడలు, నేల, సిమెంటుతో చేసిన ఇతర వస్తువులను కూడా కొరుకుతాయి.

అలాంటి పరిస్థితుల్లో కాగితం, బట్టలు, కలప వంటి వాటిని కొరుక‌డం ఎలుకలకు ఆట లాంటిది.వివిధ వస్తువులను కొర‌క‌డం వ‌ల‌న‌ ఎలుక దంతాలు ఎల్లప్పుడూ అరిగి పోతుంటాయి.

ఈ కారణంగా వాటి దంతాలు పెరగవ‌ని మ‌నం గుర్తించాలి.

Why Does A Rats Gnaw On Everything

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube