భారతీయ సినీ నటి విద్యాబాలన్. ఈమె గురించి అందరికీ పరిచయమే.
తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె హిందీ, బెంగాలీ, మలయాళ, తెలుగు సినిమాలలో కూడా నటించింది.ఇక తన పాత్రలు కూడా ఎంతో ఆకట్టుకుంటాయి.
ఈమె బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కూడా గుర్తింపు తెచ్చుకుంది.మంచి అభిమానాన్ని సంపాదించుకుంది.
2003 లో బెంగాలీ సినిమాతో సినీ ప్రవేశం చేయగా ఆ తర్వాత బాలీవుడ్ కు పరిచయమయ్యింది.తొలిసారి నటనలో మంచి పేరు తెచ్చుకున్న విద్యా ఆ తర్వాత వరుస ఆఫర్ లతో అవకాశాలు సొంతం చేసుకుంది.
టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎన్టీఆర్ బయోపిక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.ఇక బాలీవుడ్ లో కొన్ని సినిమాలలో అతిధి పాత్రల్లో, స్పెషల్ సాంగు లలో కూడా మెప్పించింది.
వెండితెర లోనే కాకుండా బుల్లితెరలో కూడా వాణిజ్య ప్రకటనలో, సీరియల్ లో నటించింది.పలు టీవీ కార్యక్రమంలో కూడా చేసింది.
సినిమాలలో తన పాత్రకే ప్రాణం పోసినట్లుగా నటిస్తుంది విద్యాబాలన్. ఇక ఈమెకు బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి ఫాలోయింగ్ ఉంది.విద్యాబాలన్ ఎక్కడికి వెళ్లిన ఎక్కువగా చీరకట్టులోనే కనిపిస్తుంది.

దాంతో ఆమెకు మరింత అభిమానం పెరిగింది.తన నటనకు పద్మశ్రీ పురస్కారం కూడా సొంతం చేసుకుంది.ఈమె 2012లో మరో నిర్మాత సిద్దార్థ రాయ్ కపూర్ ను పెళ్లి చేసుకుంది.
ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతూ లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో నటిస్తుంది.లేటు వయసులో కూడా తన అందాన్ని మాత్రం తగ్గించుకోలేదు.
గతంలో విద్యాబాలన్ బాగా లావుగా ఉండేది.ఇక ఆ సమయంలో బాగా విమర్శలు, ట్రోల్స్ ఎదుర్కొంది.అవన్నీ తట్టుకోలేక వాటర్ థెరపీ తో బరువు తగ్గించుకొని స్లిమ్ గా మారి అందరినీ షాక్ అయ్యేలా చేసింది.ఇదంతా పక్కన పెడితే ఈమె సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.
తనకు సంబంధించిన ఫోటోలను, తన వ్యక్తిగత విషయాలను బాగా షేర్ చేసుకుంటుంది.

అప్పుడప్పుడు తన ఫాలోవర్స్ తో తెగ ముచ్చట్లు కూడా పెడుతుంది.తన అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానం చెబుతుంది.ఇదిలా ఉంటే తాజాగా తన ఇన్ స్టా వేదికగా తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు పెట్టింది.
అందులో నెటిజన్లంతా తన సినిమాల గురించి, అభిరుచుల గురించి అడిగి తెలుసుకున్నారు.ఇక ఓ నెటిజన్ మీరు ఇంత అందంగా ఎందుకు ఉన్నారు అని ప్రశ్నించడంతో.

వెంటనే విద్యాబాలన్. థాంక్స్ అని చెప్పి.తన తల్లిదండ్రులు చాలా కష్టపడి కన్నారు అని స్పందించి రచ్చరచ్చ చేసింది.ప్రస్తుతం ఈ కామెంట్ నెట్టింట వైరల్ గా మారింది.ఇక ఈమె ప్రస్తుతం బాలీవుడ్ లో పలు ప్రాజెక్టుల లో బిజీగా ఉంది.టాలీవుడ్ లో మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాలో ఓ పాత్రలో నటిస్తున్నట్లు తెలిసింది.
ఇక ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే.సినిమా విడుదల వరకు ఆగాల్సిందే.







