అమరావతి: పవన్ కు కౌంటర్ ఇచ్చిన మంత్రి పేర్నినాని.నమస్కారాలతో పవన్ కళ్యాణ్ వింత సంస్కారం చూపించారు.
కానీ చిరంజీవికి నమస్కారం పెట్టకపోవడం ఆయన విజ్ఞతకె వదిలేస్తున్నా.జీవితాన్ని తీర్చిదిద్దే వారికి నమస్కారం పెట్టాలని తెలియదా.
చిరంజీవి మీకు కనపడలేదా.టీడీపీ బావుండాలి అని నేను కోరుకునేవాన్ని అని చెప్పకనే చెప్పారు.ఒక్క ఓట్ కూడా చీల కుండా చూస్తా అని చెప్తున్నారు.2019 ఎన్నికల ముందు టీడీపీ లూటీల గురించి ఎంతగా మాట్లాడారు పవన్ .ప్రభుత్వ వ్యతిరేక ఓట్ చీల్చకుండా అన్ని పార్టీలను ఏకం చేయడమే లక్ష్యం.బీజేపీ దిశా నిర్దేశం చెయ్యాలని పవన్ అడుగుతున్నారు.పవన్ లక్ష్యం జగన్ వ్యతిరేకంగా ఉండి ద్వేషించడమే.
2014 నుంచి 2019 వరకు ఎందుకు ప్రశ్నించలేదు.మానసిక అత్యాచారం చెయ్యడానికి మీరు స్పెషలిస్టా.వెల్లుల్లి వెల్లంపల్లి….అవంతి బంతి చామంతి మీరు చేసేది ఏంటి.మిమ్మల్ని ఎవరు ఏమి అనకూడదు.లైసెన్సుడ్ మానసిక అత్యాచారం చేస్తారా.2014 నుంచి మీరు తీసుకున్న ఒక్క నిర్ణయం అయినా రాష్ట్రానికి మేలు చేసిందా.ఆరోజు ఏ లక్ష్యంతో టీడీపీకి ఓట్ వెయ్యమన్నారు.ఇవాళ సభలో అన్ని అబద్ధాలు మాట్లాడారు.రాంబో రాంబాబు అని అంబటి రాంబాబుని పిలుస్తున్నావ్.మరి మీరు.
పెళ్లికి పిలిస్తే వచ్చి అక్షింతలు వేసి వెళ్ళాలి.
అమరావతి రైతుల పోరాటంలో అండగా ఉన్నది వైసీపీ.
పవన్ స్పీచ్ భీమ్లానాయక్ ప్రి రిలీజ్ ఫంక్షన్ లా ఉంది.కంఠం పవన్ ది భావం చంద్రబాబుది.
ఇవాళ పవన్ స్పీచ్ ఇదే.ఒక్క మాట కూడా ప్రత్యేక హోదా ఇవ్వని మోడీని ప్రశ్నించలా.విశాఖ ఉక్కు అమ్మద్దు అని చెప్పి ఒక్క మాట మాట్లాడలేదు.ఇవన్నీ అడగాలి…బీజేపీని చంద్రబాబును ఒక్క మాట అనలేదు.
ఇదేం పార్టీ నో… జనసేన ప్రభుత్వం స్థాపిస్తా అంటున్నాడు… ఎన్ని సీట్లలో పోటీ చేస్తారు ఇన్ని వికృత పార్టీలు కలిసి జగన్ ను ఓడించాలని లక్ష్యమా.ఒక కులాన్ని వర్గ శత్రువుగా భావిస్తోంది అంటున్నారు…మీకు కమ్మ సామాజిక వర్గం వారు చెప్పారా… కమ్మ వారిని పల్లకిలో కూర్చోపెట్టి జనసైనికుల చేత పల్లకి మోయించాలని చూస్తున్నారు.







