నిన్న జనసేన ఆవిర్భావ సభలో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం తో రాష్ట్రంలో ఏం జరగబోతోంది అనే విషయం అందరికీ అర్థమైపోయింది.ఒంటరిగా జనసేన ఎన్నికలకు వెళ్లదని ఖచ్చితంగా టిడిపి, బిజెపి పార్టీలను కలుపుకుని వెళ్లి వైసీపీ పై విజయం సాధించాలనే వ్యూహాన్ని పవన్ కళ్యాణ్ అమలు చేయబోతున్నారనే విషయం అటు జనసేన నాయకులకు ఇటు ప్రజలకు అర్థం అయిపోయింది.
జనసేన టిడిపి బిజెపిలు ఒంటరిగా పోటీ చేయడం వల్ల వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకు చీలి పోతుందని , దాని వల్ల మళ్లీ సులభంగా వైసీపీ అధికారంలోకి వస్తుందని పవన్ అభిప్రాయ పడుతున్నారు.అందుకే వైసీపీ వ్యతిరేక పార్టీలన్నిటినీ ఏకం చేసి ఉమ్మడిగా ఎన్నికలకు వెళ్లాలనే వ్యూహాన్ని పవన్ అమలు చేయాలని నిర్ణయించుకున్నట్లు అర్థమవుతోంది.
బిజెపి తమకు తగిన రూట్ మ్యాప్ ఇస్తే మరింత దూకుడుగా పోరాటం చేసేందుకు సిద్ధమని పవన్ ప్రకటించారు.బిజెపి ప్లాన్ ప్రకారమే ఏపీలో అధికారంలోకి వస్తామని పవన్ వ్యాఖ్యానించారు.
వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలకుండా పొత్తులకు సిద్ధం అంటూ పవన్ ప్రకటించడంతో టిడిపి లోను ఆశలు చిగురించాయి.మరికొద్ది నెలల్లోనే ఈ పొత్తుల అంశంపై ఒక స్పష్టమైన క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.

ఎప్పటి నుంచో ఈ తరహా సందర్భం కోసం టిడిపి ఎదురుచూస్తోంది.జనసేన బీజేపీ లను కలుపు కు వెళ్లి ఏపీలో అధికారం సాధించాలని చూస్తోంది.అయితే ఇప్పుడు టిడిపి ఎదుర్కొంటున్న ఇబ్బందుల దృష్ట్యా, పొత్తు లేకుండా ఎన్నికలకు వెళితే మరోసారి ఘోరపరాజయం తప్పదు అనే విషయాన్ని టిడిపి, ఆ పార్టీ అధినేత చంద్రబాబు గుర్తించారు. ఇక బిజెపి తమ రెండు పార్టీల ఉమ్మడి సీఎం అభ్యర్థి పవన్ కళ్యాణ్ అంటూ ప్రకటన చేసింది.
ప్రస్తుతం చంద్రబాబు వయసు రీత్యా చూసుకున్నా… లోకేష్ శక్తి సామర్ధ్యాలను అంచనా వేసినా.

2024 ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ మూడు పార్టీల ఉమ్మడి సీఎం అభ్యర్థి గా పవన్ కళ్యాణ్ ఉంటారనే విషయం అర్థమైపోతుంది.సీఎం అభ్యర్థిగా కాకుండా టిడిపి తో పొత్తు పెట్టుకునేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్ అంగీకరించరు.అలా చేస్తే జన సైనికుల నుంచి తీవ్ర ఆగ్రహాన్ని పవన్ చూడాల్సి వస్తుంది.
ఇక టీడీపీకి సైతం మరో ఆప్షన్ కనిపించకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో జనసేన తో పొత్తు పెట్టుకోవాల్సిందే.దీంతో పవన్ ప్రాధాన్యం మరింత గా పెరిగిందనే చెప్పాలి.







