దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఐటి మరియు పారిశ్రామిక శాఖలను చూసుకునేవారు.రాష్ట్రానికి పెట్టుబడులు మరియు పరిశ్రమలు అదే విధంగా స్కిల్ డెవలప్మెంట్ వంటి కార్యక్రమాలను చాలా చురుకుగా గౌతమ్ రెడ్డి నిర్వహించేవారు.
ఆయన బతికున్న సమయంలో రాష్ట్రంలో అనేక మంది విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించడంలో మరియు పరిశ్రమల పెట్టు బడులు తీసుకు రావడంలో కీలక పాత్ర పోషించే వారు.అయితే ఇటీవల ఆయన గుండె పోటు రావడంతో మరణించడం తెలిసిందే.
సీఎం వైఎస్ జగన్ కి అత్యంత సన్నిహితుడు మరియు చిన్ననాటి నుండి స్నేహితుడిగా ఉన్న మేకపాటి గౌతం రెడ్డి మరణం ఏపీ ప్రభుత్వానికి వైసీపీ పార్టీ కి తీరని లోటు అని ఆ పార్టీ నేతలు సీఎం జగన్ కూడా చెప్పారు.ఇటువంటి తరుణంలో గౌతంరెడ్డి చూసుకునే శాఖలను తాజాగా ఏపీ ప్రభుత్వం మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.
ప్రజెంట్ బుగ్గన రాజేంద్రనాథ్ ఫైనాన్స్, శాసనసభ వ్యవహారాలు, కమర్షియల్ టాక్స్ చూస్తుండగా ఇప్పుడు అదనంగా ఐటీ, పరిశ్రమలు, కామర్స్ శాఖలు అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.