సాధారణంగా మనం ఏదైనా సినిమాకి వెళ్ళినప్పుడు సినిమాలో హీరో హీరోయిన్ ఎవరు అన్న దానికంటే హీరో హీరోయిన్ లుక్స్ ఎలా ఉన్నాయి అన్నది ఎక్కువగా గమనిస్తూ ఉంటాం.కొన్ని కొన్ని సార్లు సినిమాల్లో హీరో హీరోయిన్లు లుక్స్ ఏకంగా ఇండస్ట్రీలోనే ట్రెండ్ గా మారిపోతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే.
హీరో హీరోయిన్లను అందంగా కనిపించడానికి స్టైలిస్ట్ కష్టం ఉంటుంది.ఇక హీరోయిన్లను అందంగా చూపిస్తున్న స్టైలిస్ట్ ల వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1 నీరజ కోన :
సమంత, లక్ష్మి మంచు, రకుల్ ప్రీత్ సింగ్, సాయి పల్లవి, రీతువర్మ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మందికి ఈమె పర్సనల్ స్టైలిస్ట్ గా వ్యవహరించారు.గుండెజారి గల్లంతయ్యిందే, నిన్నుకోరి, అత్తారింటికి దారేది సినిమాలో సమంతకి, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ ఇలా చాలానే సినిమాలకు స్టైలిస్ట్ గా పనిచేశారు.
కేవలం స్టైలిస్ట్ గా మాత్రమే కాదు కాస్ట్యూమ్ డిజైనర్ గా కూడా ఎన్నో సినిమాలకు పని చేశారు నీరజ కోన.
2 అశ్విన్ మావ్లే :
జూనియర్ ఎన్టీఆర్, నితిన్, అల్లు అర్జున్ ఇలా చాలామంది హీరోలకి స్టైలిస్ట్ గా చేశారు అశ్విన్.హీరోలు ప్రేక్షకులకు అందంగా కనిపించడానికి ఈ స్టైలిస్ట్ కారణం అని చెప్పాలి.అలాగే తొలి ప్రేమ, పడి పడి లేచే మనసు తో మరికొన్ని సినిమాలకు స్టైలిస్ట్ గా కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేశాడు.
3 గీతిక చడ్డా :
రకుల్ ప్రీత్ సింగ్, రానా దగ్గుబాటికి పర్సనల్ స్టైలిస్ట్ గా పని చేశారు.
4 నితిషా శ్రీరామ్ :
క్యూట్ బ్యూటీ రాశి ఖన్నాతో పాటు, ఇంకా కొంత మంది నటులకి స్టైలిస్ట్ గా పని చేశారు.అంతేకాకుండా నమ్రత శిరోద్కర్ కి కూడా పర్సనల్ స్టైలిస్ట్ గా వ్యవహరించారు.
5 హర్మన్ కౌర్ :
రౌడీ హీరో విజయ్ దేవరకొండ క్రేజీ లుక్ వెనక హార్మన్ కౌర్ అనే స్టైలిస్ట్ కష్టం ఉందట.విజయ్ దేవరకొండ తో పాటు అఖిల్, రామ్, ప్రణీత సుభాష్, అల్లు అర్జున్ కి స్టైలిస్ట్ గా వ్యవహరిస్తూ ఉండడం గమనార్హం.
6 ప్రీతం జుకాల్కర్ :
ప్రీతం జుకాల్కర్ సమంత పర్సనల్ స్టైలిస్ట్ గా ఎంతో ఫేమస్ అయ్యాడు.ఇక సమంతతో పాటు నిహారిక కొణిదెల, లావణ్య త్రిపాఠికి స్టైలిస్ట్ గా పని చేశాడు.
7 పల్లవి సింగ్ :
మీలో ఎవరు కోటీశ్వరుడు సమయంలో హోస్టు గా ఉన్న నాగార్జున కి స్టైలిస్ట్ చేశారు పల్లవి సింగ్.అలాగే అఆ, జనతా గ్యారేజ్, అదిరింది సినిమాల్లో సమంతకు స్టైలిస్ట్ గా వ్యవహరించారు.మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కి, సర్కార్ సినిమాలో విజయ్ కి ఇంకా ఎంతో మందికి స్టైలింగ్ చేసిన అనుభవం పల్లవి సింగ్ సొంతం.
8 అర్చా మెహతా :
టాలీవుడ్ చందమామగా కాజల్ అగర్వాల్ అందర్ని ఆకర్షించటానికి వెనుక స్టైలిస్ట్ ఈ కష్టం ఉందట.కాజల్ కి చాలా సినిమాల్లో స్టైలింగ్ చేశారు ఈమె.అలాగే రాశి ఖన్నా, క్యాథరిన్ తెరిసా, కాజల్ అగర్వాల్ కి పర్సనల్ స్టైలిస్ట్ గా పని చేశారు.
9 శ్రావ్య వర్మ :
విజయ్ దేవరకొండ, కీర్తి సురేష్, రష్మిక మందన వీళ్ళందరికీ స్టైలిస్ట్ గా వ్యవహరిస్తున్నారు శ్రావ్య వర్మ.
10 అక్షయ్ త్యాగి :
సూపర్ స్టార్ మహేష్ బాబుకి పర్సనల్ స్టైలిస్ట్ గా అక్షయ్ త్యాగి ఎంతగానో గుర్తింపు ఉంది.శ్రీమంతుడు నుంచి అన్ని సినిమాలకు మహేష్ బాబుకి స్టైలింగ్ చేసింది అక్షయ్ త్యాగి కావటం గమనార్హం.