దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ సినిమా ఆర్ఆర్ఆర్.ఈ సినిమాను టాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా తెరకెక్కించాడు.
ఇందులో టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించారు.ఇందులో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుంటే.
ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తున్నాడు.
ఈ సినిమాలో ఆలియా భట్, ఒలీవియా మోరిస్, అజయ్ దేవగణ్ కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
డివివి దానయ్య ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.అయితే ఈ సినిమా విడుదల చేయాలనీ చూసినప్పుడల్లా ఏదొక సమస్య వస్తూనే ఉంది.
పలు వాయిదాల తర్వాత ఎట్టకేలకు ఈ సినిమా మార్చి 25న రిలీజ్ కానుందని ఇటీవలే ప్రకటించారు.
ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ మరో సినిమా ఇంత వరకు స్టార్ట్ చేయలేదు.
ఆయన తో పాటు నటించిన చరణ్ ఇప్పటికే ఆర్సీ 15 స్టార్ట్ చేసి ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు.కానీ తారక్ మాత్రం ఇంత వరకు కొత్త ప్రాజెక్ట్ పట్టాలెక్కించకుండా అలానే సైలెంట్ గా ఉన్నాడు.

చరణ్ కంటే ముందుగానే ఎన్టీఆర్ తన తర్వాత సినిమాను ఎన్టీఆర్ ప్రకటించిన కూడా ఇంత వరకు స్టార్ట్ అవ్వలేదు.
కొరటాల శివ దర్శకత్వంలో సినిమా ఓకే అయినా కూడా బుచ్చిబాబు విషయంలో మాత్రం తారక్ ఇంకా సైలెంట్ గానే ఉన్నాడు.ఎందుకు ఈయన డిలే చేస్తున్నాడు అని ప్రశ్నలు మొదలయ్యాయి.తారక్ బుచ్చిబాబు విషయంలో ఇంత టైం ఎందుకు తీసుకుంటున్నాడు అంటే ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ అయితే కానీ తారక్ ఒక నిర్ణయానికి రాకూడదు అని అనుకుంటున్నాడట.
అందుకే ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ అయినా తర్వాతనే బుచ్చి బాబుకి ఓకే చెప్పాలా వద్ద అని ఆలోచిస్తాడట.







