ప్రేమగా పెంచుకున్న పెంపుడు జంతువులు కనిపించకుండా పోతే చాలా బాధ వేస్తుంది.అలాగే వాటి ఆచూకీ కోసం కనీసం ఒక సంవత్సరం వరకైనా వెతకాలి అనిపిస్తుంది.
అయితే ఒక మహిళ మాత్రం ఏళ్లపాటు తప్పిపోయిన తన పిల్లి కోసం వెతికింది.తన పిల్లి కోసం ఆమె పోస్టర్లు అంటించని ప్రదేశాలు లేవు.
చివరికి తన కృషి ఫలించి 17 ఏళ్ల తర్వాత ఆమె తన పిల్లిని మళ్లీ కలుసుకోగలిగింది.
వివరాల్లోకి వెళితే కిమ్ కొల్లియర్ అనే ఒక యువతి చాలా ఏళ్ల క్రితం ఇంగ్లాండ్ నుంచి స్కాట్లాండ్‌కు మకాం మార్చింది.
ఈమె మిడ్లోథియన్‌లోని కొత్త ఇంటిలో తన పిల్లితో సహా కొత్తగా లైఫ్ స్టార్ట్ చేసింది.దాని తర్వాత ఆమె పిల్లి అదృశ్యమైంది.తరువాత కిమ్ కనిపించకుండా పోయిన తన టిల్లీ పిల్లి ఆచూకీ తెలపాలంటూ పోస్టర్‌లు వేయడం ప్రారంభించింది.అలా చాలా ఏళ్లుగా ఆమె తన పిల్లిని కనుగొనాలని ప్రయత్నాలు చేస్తూనే ఉంది.
ఈ నేపథ్యంలోనే టిల్లీ అనే పిల్లి దొరికింది, ఇది మీదేనా అంటూ ఒక యానిమల్స్ రెస్క్యూ టీం ఆమెను సంప్రదించింది.అలా ఆమె 17 ఏళ్ల తర్వాత తన పిల్లిని కలుసుకోగలిగింది.

ఇప్పుడు టిల్లీ వయసు 20 ఏళ్లు.దాని ఆరోగ్య పరిస్థితి బాగా క్షీణించింది.అయితే అది 17 ఏళ్ల క్రితం ఎక్కడ తప్పి పోయిందో అక్కడే తాజాగా ఓ వ్యక్తికి దొరికిందట.ప్రస్తుతం కిమ్ పెంట్‌ల్యాండ్ వెటర్నరీ క్లినిక్‌లో పనిచేస్తోంది.ఇప్పుడు ఆ పిల్లికి అక్కడే పాలియేటివ్ కేర్ అందిస్తోంది కిమ్.బలం పుంజుకున్న తర్వాత తన పిల్లిని తిరిగి ఇంటికి తీసుకోచ్చుకోవాలని ఆమె భావిస్తోంది.
ఏదేమైనా ఈ స్టొరీ గురించి విన్న ప్రతి ఒక్కరు అవాక్కవుతున్నారు.చివరి రోజుల్లోనైనా మీరిద్దరూ ఏకమయ్యారు.
అది చాలా హ్యాపీ ఎండింగ్ అని చాలామంది కామెంట్లు పెడుతున్నారు.







