నేడు జనసేన పార్టీ ఆవిర్భావ సభ జరగబోతోంది.ఈ సభను జనసేన ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పాటు, దానికి తగ్గట్లుగానే భారీగా ఏర్పాట్లు చేశారు.
ప్రభుత్వం నుంచి కఠినమైన నిబంధనలు విధించడంతో జనసేన సైతం సొంతంగానే జన సైనికులకు కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. జనసేన పార్టీ ఆవిర్భావ సభ నేడు గుంటూరు జిల్లా మంగళగిరిలో జరగబోతోంది.
పార్టీ ఆవిర్భావించి ఎనిమిది సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యం లో ఈ సభను విజయవంతంగా పూర్తి చేసేందుకు ఆ పార్టీ భారీగా ఏర్పాట్లు చేసింది.అయితే ఈ సభలో పవన్ అనేక అంశాలపై మాట్లాడుతారు ? ఏ కీలకమైన నిర్ణయాలను ప్రకటిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.ముఖ్యంగా ఈ ఆవిర్భావ సభలో పవన్ ప్రసంగం ఏ విధంగా ఉండబోతుంది అనేది ఉత్కంఠ కలిగిస్తోంది.

ముఖ్యంగా జనసేన బిజెపి పొత్తు వ్యవహారం పై పవన్ స్పందించే అవకాశం కనిపిస్తోంది.బిజెపి వ్యవహారంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.ఈ నేపథ్యంలో బిజెపితో పొత్తు అంశం పై పవన్ స్పందించే అవకాశం కన్పిస్తోంది. వైసీపీ ప్రభుత్వాన్ని అధికారానికి దూరం చేసేందుకు , ఆ పార్టీతోనూ పొత్తు పెట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని పవన్ ప్రకటిస్తారని అంతా అంచనా వేస్తున్నారు.2019 ఎన్నికల్లో జనసేన ఘోరంగా ఓటమి చెందడంతో, ఆ తరహా ఫలితాలు మళ్ళీ రిపీట్ కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 2024 ఎన్నికల్లో జనసేన ప్రభుత్వం ఏర్పడుతుందని నమ్మకాన్ని పార్టీ నాయకులతో పాటు, జనాలలోను అభిప్రాయం కలిగించే విధంగా ముందడుగు వేసే అవకాశం కనిపిస్తోంది.ఈ సందర్భంగా టిడిపితో పొత్తు వ్యవహారం పైన పవన్ స్పందించే అవకాశం కనిపిస్తోంది.
అవసరమైతే బీజేపీకి దూరమై టీడీపీతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉండొచ్చు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఏపీలో కీలకంగా ఉన్న కాపు సామాజికవర్గం ను మరింత దగ్గర చేసుకునేందుకు, కాపు సామాజిక వర్గం పై పవన్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లుగా జనసేన వర్గాలు పేర్కొంటున్నాయి.
అలాగే పార్టీలో పెద్ద ఎత్తున చేరికలను ప్రోత్సహించే విధంగా పవన్ ప్రసంగం ఉండబోతోందట.ఏది ఏమైనా జనసేన అధినేత ఈ రోజు చేయబోయే ప్రసంగం మాత్రం ఏపీ రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టించే విధంగా ఉండబోతుంది అనే విషయం స్పష్టంగా అర్ధం అవుతోంది.







