ఒక హార్ట్ టచింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.ఇందులో ఒక చిన్నారి స్నోబోర్డింగ్ చేస్తూ తనలో తానే ఫన్నీగా మాట్లాడుకుంది.
ఇది చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు.చేజింగ్ సేజ్ అనే ఒక ఇన్ స్టాగ్రామ్ పేజీ దీన్ని మొదటగా షేర్ చేసింది.
తర్వాత దీన్ని వర్త్ ఫీడ్ పేజీ షేర్ చేసింది.దీనికి ఇప్పటికే 50 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.
వైరల్ అవుతున్న వీడియోలో సేజ్ అనే ఓ నాలుగేళ్ల చిన్నారిని చూడొచ్చు.ఈ బాలిక మంచుపై స్నోబోర్డింగ్ చేస్తూ కనిపించింది.స్నోబోర్డింగ్ చేసేముందు తల్లిదండ్రులు ఈ చిన్నారికి ఒక మైక్రో ఫోన్ యాడ్ చేశారు.దాంతో ఆ చిన్నారి తనలో తాను చిన్నగా మాట్లాడుకున్న మాటలన్నీ బయటకు వినిపించాయి.“నేను కింద పడను.ఒకవేళ పడినా పడొచ్చు.
దట్స్ ఓకే.ఎందుకంటే మనమందరం ఎప్పుడో ఒకసారి కింద పడేవాళ్లమే” అంటూ ముద్దు ముద్దుగా మనసుని హత్తుకునేలా ఈ చిన్నారి మాటలు మాట్లాడింది.
దీనికి సంబంధించిన వీడియోని తల్లిదండ్రులు సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకోగా దాన్ని వర్త్ ఫీడ్ అనే ఒక ఇన్ స్టాగ్రామ్ పేజీ ఈ పోస్ట్ చేసింది.అది కాస్తా ఇప్పుడు వైరల్ గా మారింది దీన్ని చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.“అమ్మాయి చాలా క్యూట్ గా మాట్లాడుతోంది.చూస్తుంటే మనసుని హత్తుకునేలా ఉంది.” అని కొందరు కామెంట్ చేస్తున్నారు.దీంతో ఇప్పటికే రెండు లక్షలకు పైగా లైకులు వచ్చాయి.
ఈ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి.అయితే తల్లిదండ్రులు @chasing.
sage అనే ఓ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా తమ అమ్మాయికి సంబంధించిన వీడియోలను ఒక సిరీస్ లాగా మరిన్ని షేర్ చేశారు.అవి కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వాటిని కూడా మీరు చూసేయొచ్చు.







