సాధారణంగా ఫీల్డింగ్ చేస్తున్న క్రికెటర్లు ఏదైనా ఔట్ విషయంలో వారిలో వారే చర్చించుకుంటారు.కానీ తాజాగా ఒక పాకిస్థాన్ క్రికెటర్ మాత్రం సొంత టీమ్ మెంబర్స్ ని అడగలేదు.అందుకు బదులుగా అతడు ఏకంగా బ్యాటింగ్ చేస్తున్న ప్లేయర్‌నే ఇది ఔటా ?? కాదా??అని ప్రశ్నించాడు.“దీనిపై డీఆర్ఎస్ తీసుకోవాలా?? వద్దా?? చెప్పు ప్లీజ్ బ్రో” అంటూ సదరు వికెట్ కీపర్ బ్యాటర్ అభిప్రాయాన్ని కోరాడు.వినడానికి ఇది చాలా విచిత్రంగా ఉంది కదూ.కానీ ఇది నిజంగానే జరిగింది.
వివరాల్లోకి వెళితే.ప్రస్తుతం కరాచీ వేదికగా పాకిస్థాన్, ఆస్ట్రేలియా జట్ల మధ్య సెకండ్ టెస్టు మ్యాచ్ జరుగుతోంది.ఈ మ్యాచ్ లో మొదటగా ఆసీస్ బ్యాటింగ్ చేసింది.అయితే తొలి ఇన్నింగ్స్ లోని 70వ ఓవర్ లో పాక్ స్పిన్నర్ నౌమన్ అలీ విసిరిన బంతిని బ్యాటర్ స్టీవ్ స్మిత్ ఎదుర్కొన్నాడు.
ఆ బంతి స్మిత్ ప్యాడ్ కు తగిలింది.దీంతో బోలర్ తో పాటు మిగతా పాక్ ఫీల్డర్లు ఎల్బీడబ్ల్యూ అప్పీల్ చేశారు.
ఈ విషయంలో డీఆర్ఎస్ తీసుకుందామా అని కెప్టెన్ బాబర్ ఆజమ్ వికెట్ కీపర్ అయిన మహ్మద్ రిజ్వాన్ వైపు చూస్తూ అడిగాడు.ఈ క్రమంలో కొద్ది సెకన్ల పాటు బౌలర్, కెప్టెన్ మధ్య చర్చ జరిగింది.

ఈ నేపథ్యంలోనే రిజ్వాన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ వద్దకు వెళ్లి అతడు భుజంపై చేయి వేశాడు.అనంతరం ‘బ్రో బంతి వికెట్ల పైనుంచి పోయేది అంటావా? ఇంతకీ ఇది ఔటంటావా? కాదంటావా.? ప్లీజ్ చెప్పు బ్రో.డీఆర్ఎస్ కు వెళ్లమంటావా?” అని సరదాగా అడిగాడు.ఇది చూసిన మిగతా ప్లేయర్లందరూ నవ్వాపుకోలేక పోయారు.రిజ్వాన్ అడిగిన ఫన్నీ ప్రశ్నకు ఆసీస్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ కూడా నవ్వేసాడు.దీనికి సంబంధించిన వీడియో ట్విట్టర్ లో వైరల్ గా మారింది.ఇది చూసిన ఫ్యాన్స్ తెగ నవ్వుకుంటున్నారు.
మీరు కూడా ఈ వీడియో పై ఒక లుక్కేయండి.







