దర్శకుడు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బుట్ట బొమ్మ పూజా హెగ్డే నటించిన తాజా చిత్రం రాధేశ్యామ్.తాజాగా ఈ సినిమా మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల అయిన విషయం తెలిసిందే.
ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభిస్తోంది.ఈ సినిమాలో ప్రభాస్ ప్రపంచంలోనే మేటి జ్యోతిష్కుడు అయినా విక్రమ ఆదిత్య పాత్రలో నటించి మెప్పించాడు.
సినిమా కోసం ప్రభాస్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూశారు.నిరీక్షణ కు తగ్గట్టుగా ప్రేక్షకుల నుంచి ఈ సినిమా కు మిశ్రమ స్పందన లభిస్తోంది.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే.ఇందులో ప్రభాస్ గురువు అయిన పరమహంస అనే పాత్రలో నటించారు.
ప్రభాస్ కృష్ణంరాజు కాంబినేషన్ లో వచ్చిన మూడో సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది.వీరిద్దరూ కలిసి ఇంతకుముందు రెబెల్, బిల్లా సినిమాలో కలిసి నటించిన విషయం తెలిసిందే.
రాధేశ్యామ్ సినిమా రిలీజ్ కి ముందు పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్నారు కృష్ణంరాజు.ఈ క్రమంలోనే ప్రభాస్ గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

ప్రభాస్ మన ఊరి పాండవులు లాంటి సినిమాలు చేస్తే చూడాలని ఉంది అని కృష్ణంరాజు తెలిపారు.అనంతరం ప్రభాస్ పెళ్లి గురించి మాట్లాడుతూ..ఆయనకు పెళ్లయి పిల్లలు పుడితే ఎత్తుకొని ఆడించాలని ఉంది అంటూ కృష్ణంరాజు తెలిపారు.ఇటీవలే ప్రభాస్ పెళ్లి వార్తలపై కృష్ణం రాజు సతీమణి శ్యామలాదేవి స్పందించిన విషయం తెలిసిందే.ప్రభాస్, అనుష్కల పెళ్లి వినిపిస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదు అని శ్యామలాదేవి తెలిపింది.
అదేవిధంగా బాధితులు మంచి స్నేహితులు మాత్రమే, వారి మధ్య ఎలాంటి ఫీలింగ్స్ లేవు అంటూ ప్రభాస్ అనుష్కల పెళ్లి విషయంలో వస్తున్న వార్తలను ఖండించింది శ్యామలాదేవి.ప్రభాస్ కు మన సంస్కృతి సాంప్రదాయాల కంటే మహిళల ఫై అమితమైన గౌరవం ఉంది.
ఇంట్లో పెద్దవాళ్ళకు కుటుంబ సభ్యులకు కూడా అదేవిధంగా మంచి గౌరవం ఇస్తాడు.ప్రభాస్ తప్పకుండా పెళ్లి చేసుకుంటారు.
కానీ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు అని తెలిపింది శ్యామలాదేవి.







