బుల్లితెర జంట సుడిగాలి సుధీర్, యాంకర్ రష్మీ కి ఉన్న క్రేజ్ ప్రత్యేకత గురించి మనందరికీ తెలిసిందే.ఈ జంటకు యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉంది.
అంతే కాకుండా వీరు రియల్ లైఫ్ లో పెళ్లి చేసుకుని ఒక్కటైతే బాగుండు అని లక్షలాది మంది ప్రేక్షకులు కోరుకుంటున్నారు.ఇప్పటికే ఈ జంటకు రెండుసార్లు మల్లెమాల వారు పెళ్లి చేసిన విషయం తెలిసిందే.
అంతేకాకుండా రష్మీ సుధీర్ లు అప్పుడప్పుడు బుల్లితెరపై పలు ఈవెంట్లలో షోలలో రొమాంటిక్ సాంగ్ లకు డాన్సులు వేస్తూ ప్రేక్షకులను మరింత అలరిస్తూ ఉంటారు.దాదాపుగా గథ 9 ఏళ్లుగా ఈ జంట ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది.
ఇది ఇలా ఉంటే ఈ మధ్యకాలంలో సుధీర్, రష్మీ లు అంతగా కనిపించడం లేదు.
ఢీ షో లో వీరిద్దరు జంటగా కనిపించేవారు.
కానీ ఇప్పుడు ఆ అవకాశం కూడా లేకుండా పోయింది.బుల్లితెర పై రష్మీ, సుధీర్ ల పై చేసిన ఎన్నో ఈవెంట్లు సూపర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే.
ఆ ఈవెంట్ లలో వారిద్దరి పెళ్లి అప్పట్లో సంచలనం సృష్టించింది ఈ మధ్యకాలంలో రష్మీ సుధీర్ లు జంటగా కనిపించి చాలా రోజులు అవుతోంది.అంతేకాకుండా పండుగ స్పెషల్ ఈవెంట్ లో కూడా వీరు సరిగ్గా కనిపించడం లేదు.
సుదీర్ ఈ టీవీ షోలకు వెళ్తుండగా, రష్మీ మాత్రం జీ తెలుగు స్టార్ మా అంటూ అన్ని చానల్స్ ని కవర్ చేస్తోంది.ఒక మల్లెమాల ఈ మధ్య కాలంలో స్పెషల్ ఈవెంట్ లకు సుధీర్ ని దూరం పెడుతున్నట్లు కనిపిస్తోంది.
ఇక హోలీ పండుగ సందర్భంగా మల్లెమాల వారు హోలీ ఈవెంట్ ను నిర్వహించారు.

అందుకు సంబంధించి తాజాగా ప్రోమో కూడా విడుదల అయ్యింది.ఇక అందులో సుధీర్ తప్ప మిగిలిన వారందరూ కూడా కనిపించారు.దీనితో ఆ వీడియో ని చూసిన సుధీర్ అభిమానులు సుధీర్ ఎక్కడ అంటూ మల్లెమాల వారి పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సుధీర్ అదే హోలీ ఈవెంట్ కు స్టార్ మా ఛానల్ లో కనిపించాడు.హోలీ పండుగ సందర్భంగా తగ్గేదే లే అంటూ ఒక ఈవెంట్ నిర్వహించగా దానికి యాంకర్ రష్మి, రవి హోస్ట్ గా చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇందులోరష్మీ కోసం సుధీర్ పాట కూడా పాడారు. రష్మీ సుధీర్ కు దిష్టి చుక్క పెట్టడం మరింత అట్రాక్షన్ గా నిలిచింది.ఇక ఇప్పుడు మల్లెమాల చేస్తోన్న హోళీ పండుగ ఈవెంట్‌కు టీఆర్పీ రాదు అని క్లియర్ గా అర్థమవుతోంది.మొదటి సారిగా స్టార్ మా ఈవెంట్ గురించి ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.
ఈ ఈవెంట్ టీఆర్పీ రేటింగ్ రికార్డులు క్రియేట్ చేస్తుందని సుధీర్ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.







