తెలుగు సినీ దర్శకులతో పాటు దేశవ్యాప్తంగా ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్నా సినిమా రాధేశ్యామ్ ఎట్టకేలకు తాజాగా మార్చి 11న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల అయ్యింది.ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు.
రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటించగా హీరోయిన్ పూజా హెగ్డే నటించింది.పీరియాడికల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి బాగానే స్పందన లభిస్తోంది.
కొంతమంది ఈ సినిమా బాగుంది హిట్టు అని పొగుడుతుండగా, ఇంకొందరు మాత్రం సినిమా యావరేజ్ గా ఉంది, చాలా స్లోగా ఉంది అని కామెంట్ చేస్తున్నారు.
కొంత మంది నెటిజన్లు అయితే ఈ సినిమాలో ప్రభాస్ చేయాల్సింది కాదు అని కామెంట్స్ చేస్తున్నారు ఇలా ఒక్కొక్క నెటిజన్ ఒక్కొక్క విధంగా కామెంట్స్ చేస్తుండటంతో, ఈ నెగిటివిటీ కామెంట్లపై సంగీత దర్శకుడు తమన్ పరోక్షంగా స్పందించారు.
అందుకు సంబంధించిన ట్వీట్ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.సినిమా స్లోగా ఉంది అని కామెంట్స్ చేసే వారందరికీ కౌంటర్ ఇచ్చే విధంగా ఉన్న మీమ్ ని ట్విట్టర్ లో షేర్ చేశాడు తమన్.
సినిమా ఎలా ఉంది అన్న ప్రశ్నకు.బాగా స్లోగా ఉంది అని చెప్పగా.

నేను అడిగింది బాగుందా లేదా అని మాత్రమే అడిగాను.లవ్ స్టోరీస్ లో కాకుండా ఫస్టాఫ్ లో ఫస్ట్ నైట్ సెకండాఫ్ లో సెకండ్ సెటప్ పెట్టాలా ఏంటి అని చిర్రుబుర్రలు ఆడుతున్నట్టుగా ఉంది .ఇక ఈ మీమ్ ని షేర్ చేసిన తమన్. మీమ్ అదిరింది.
స్లో అంట.నువ్వు పరిగెత్తాల్సిందే అంటూ ట్రోలర్స్ పై సెటైర్ వేసాడు తమన్.ఇక ఈ ట్వీట్ కు బ్లాక్ బస్టర్ రాధేశ్యామ్ అన్న హ్యాష్ ట్యాగ్ ను జత చేసాడు.మరి తమన్ చెప్పిన విధంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందా లేదా తెలియాలి అంటే వేచిచూడాల్సిందే మరి.మొత్తానికి థమన్ చేసిన ట్వీట్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.







