చరణ్ జోరు చూపిస్తున్న.. ఎన్టీఆర్ ఎందుకు సైలెంట్ గా ఉంటున్నాడు?

రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న విషయం తెలిసిందే.

 Latest News On Ram Charan And Ntr Movies On Sets Details, Rrr, Ram Charan, Ntr,-TeluguStop.com

టాలీవుడ్ లో బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను 350 కోట్ల భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నాడు.గత మూడు సంవత్సరాలుగా రామ్ చరణ్, ఎన్టీఆర్ లు ఈ సినిమా కోసం రాత్రిపగలు కష్టపడుతున్నారు.

ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యి విడుదల చేద్దాం అనుకుంటున్న సమయంలో కరోనా కారణంగా వాయిదా పడింది.అయితే ఎన్నో వాయిదాల తర్వాత ఈ సినిమా మార్చి 25న రిలీజ్ కాబోతుంది.

ఈ సినిమా రిలీజ్ కు కొద్దీ రోజులే ఉండడంతో రాజమౌళి ప్రొమోషన్స్ కూడా స్టార్ట్ చేసేసాడు.ఇది పక్కన పెడితే ఈ స్టార్స్ ఇద్దరు తమ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ను సెట్స్ మీదకు తీసుకు వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు.

ఈ విషయంలో చరణ్ తారక్ కంటే కాస్త ముందు ఉన్నాడు.చరణ్ అటు ఆర్ ఆర్ ఆర్ సినిమా చేస్తూనే ఇటు తండ్రి సినిమా ఆచార్య లో కూడా కీలక పాత్ర చేసిన విషయం తెలిసిందే.

Telugu Acharya, Charan Ntr, Koratala Shiva, Rajamouli, Ram Charan, Shankar-Movie

దీంతో పాటు ఇప్పుడు శంకర్ ప్రాజెక్ట్ కూడా సెట్స్ మీదకు తీసుకు వెళ్లి శరవేగంగా షూటింగ్ కూడా పూర్తి చేస్తున్నాడు.ఈ సినిమాను భారీ బడ్జెట్ తో దిల్ రాజు పాన్ ఇండియా సినిమాగా నిర్మిస్తున్నాడు.ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ చరణ్ కు జోడీగా నటిస్తుంది.

Telugu Acharya, Charan Ntr, Koratala Shiva, Rajamouli, Ram Charan, Shankar-Movie

ఈ సినిమా పూర్తి అయినా వెంటనే చరణ్ గౌతమ్ తిన్ననూరితో సినిమా చేయబోతున్నాడని టాక్.అయితే ఎన్టీఆర్ కూడా ఆర్ ఆర్ ఆర్ తర్వాత కొరటాల శివ తో సినిమా చేస్తున్నట్టు ప్రకటించాడు.అయితే ఈ సినిమా ఎప్పుడో అక్టోబర్ లోనే సెట్స్ మీదకు వెళ్లాల్సి ఉండగా ఇప్పటి వరకు అటు కొరటాల కానీ ఇటు ఎన్టీఆర్ కానీ నోరుమెదపడం లేదు.

దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు.ఒకవైపు చరణ్ వరుస సినిమాలతో జోరు చూపిస్తుంటే మరోవైపు ఎన్టీఆర్ మాత్రం అస్సలు మరో సినిమా ఇప్పటి వరకు పూర్తి చెయ్యలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube