ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో పుతిన్‌ను నిలువరించేందుకు అమెరికా ఆంక్షల కొరడా ఝళిపించిన సంగతి తెలిసిందే.అంతేకాదు.
ఉక్రెయిన్‌కు ఆయుధాలు, ఆర్ధిక సాయం సైతం అందించింది.ఇదే సమయంలో దౌత్య మార్గాల ద్వారా కూడా రష్యాను అడ్డుకునేందుకు ప్రయత్నించింది.
రెండు సార్లు ఐక్యరాజ్యసమితిలో రష్యాకు వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశపెట్టింది.అయితే వీటిలో ఒక్కసారి కూడా భారత్ ఓటింగ్‌లో పాల్గొనకుండా దూరంగా వుండటం అంతర్జాతీయంగా చర్చకు దారి తీసింది.
అయితే ఇది అమెరికాకు కంటగింపుగా మారింది.కానీ భారత్‌తో అవసరాల దృష్ట్యా మౌనంగానే వుండిపోయింది తప్పించి బయటపడలేదు.
అయినప్పటికీ భారత్‌ను నయానో, భయానో దారికి తెచ్చుకునేందుకు బైడెన్ అడ్మినిస్ట్రేషన్ పావులు కదుపుతూనే వుంది.ఇదే సమయంలో సొంత చట్ట సభ్యులు.భారత్‌పై చేస్తోన్న విమర్శల దాడి నుంచి బైడెన్ ఉన్నతాధికారులు న్యూఢిల్లీకి మద్ధతుగా నిలుస్తున్నారు.పెంటగాన్‌కు చెందిన ఓ అధికారి మాట్లాడుతూ.
రష్యాతో భారత్‌కు చారిత్రాత్మకమైన సంబంధాలు వున్నాయని అమెరికా గుర్తించిందన్నారు.అయితే ఇటీవలి కాలంలో భారత్.
ఆయుధ కొనుగోళ్ల విషయంలో రష్యాకు దూరంగా వుండాలని భావిస్తోందని ఆయన అన్నారు.దేశీయంగా రక్షణ ఉత్పత్తుల విషయంలో అభివృద్ధిని సాధించాలని ప్రణాళికలు రూపొందిస్తోందని.
కానీ అందుకు కొంత సమయం పడుతుందని ఆయన చెప్పారు.
కాగా.
రష్యాకు వ్యతిరేకంగా అమెరికా ప్రవేశపెట్టిన తీర్మానానికి భారత్ దూరంగా వుండటం పట్ల ఇండో అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా సైతం భారత ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.చైనా విస్తరణ ప్రణాళికలకు వ్యతిరేకంగా భారత్‌కు అండగా నిలబడేది అమెరికాయే తప్ప.రష్యా కాదని రో ఖన్నా అభిప్రాయపడ్డారు.1962లో ఇండియాపై చైనా దాడి సమయంలో భారత్‌కు అప్పటి అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నెడీ అండగా నిలిచారని ఖన్నా గుర్తుచేస్తున్నారు.పుతిన్‌కు వ్యతిరేకంగా ఇది భారత్ నిలబడాల్సిన సమయమని.గైర్హాజరు కావడం ఆమోదయోగ్యం కాదన్నారు.రో ఖన్నాతో పాటు మరో కాంగ్రెస్ సభ్యుడు ఎరిక్ స్వాల్వెల్ కూడా భారత్ చర్య నిరాశను కలిగించిందన్నారు.భారతీయ అమెరికన్లు ప్రాదేశిక సమగ్రత, మానవ హక్కులను విశ్వసిస్తారని స్వాల్వెల్ చెప్పారు.

మరోవైపు చైనాతో పెరుగుతోన్న మాస్కో సాన్నిహిత్యం.రష్యా ఆయుధాలపై ఆధారపడటం సహా భారతదేశ ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తుందని అమెరికా వ్యూహాత్మక విభాగంలోని పలువురు ఇటీవలి కాలంలో వాదించారు కూడా.భారత్‌కు మద్ధతుగా వుండే రిపబ్లికన్ సభ్యులలో కొందరు కూడా ఓటింగ్ వేళ న్యూఢిల్లీ వైఖరిపై గుర్రుగా వున్నారు.సౌత్ కరోలినా నుంచి కాంగ్రెస్‌కు ప్రాతినిధ్యం వహిస్తోన్న జో విల్సన్ భారత్ చర్యపై అసహనం వ్యక్తం చేశారు.







