రీసెంట్ గా మ్యారేజ్ చేసుకున్నారా.. అయితే ప్రభుత్వమిచ్చే రూ.2.5 లక్షలు అందుకోండిలా..!

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఒక మర్చిపోలేని మధురనుభూతి అనే చెప్పాలి.పెళ్లి అనే బంధంతో ఇద్దరు వ్యక్తుల జీవితం ఒకటిగా ముడి పడుతుంది.

 Recently Married. Receive Rs 2.5 Lakh From The Government Recent, Marraige, Late-TeluguStop.com

అయితే ఈ మధ్య కాలంలో పిల్లలు తల్లి దండ్రుల ఇష్టం మేరకు కాకుండా ప్రేమించి పెళ్లి చేసు కుంటున్నారు.అప్పట్లో పెళ్లి చేసుకోవాలంటే తమ కులానికి సంబంధించిన వారినే పెళ్లి చేసుకునే వాళ్ళు.

కానీ ఈ మధ్య కాలంలో ప్రేమ పెళ్లిళ్లు, కులాంతర వివాహాలు ఎక్కువ అయిపోతున్నాయి.అయితే ఇలా కులాంతర వివాహం చేసుకునే వారికి గుడ్ న్యూస్ అనే చెప్పాలి.

పెళ్లి తరువాత వారు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఆర్థిక సాయం పొందేలా ఒక స్కిమ్ కూడా అందుబాటులో ఉందనే విషయం మీలో చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు.

ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ చేసుకునే వారికి ఈ స్కీమ్ ద్వారా ఆర్ధికసహాయం లభిస్తుందన్నమాట.

మరి ఇంతకీ ఆ స్కీమ్ పేరు ఏంటి.? ఎంత డబ్బులు ఇస్తారు అనే వివరాలు చూద్దామా.ఆ స్కిమ్ పేరు “డాక్టర్ అంబేద్కర్ స్కీమ్ ఫర్ సోషల్ ఇంటిగ్రేషన్ త్రూ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్” అంటే కులాంతర వివాహం చేసుకున్న వారు పెళ్లి అయిన తొలి రోజుల్లో ఆర్థిక ఇబ్బందులు పడకుండా ఉండేందుకు గాని, వారు జీవితంలో సెటిల్ అవ్వడానికి ఈ స్కీమ్ ద్వారా ఆ దంపతులకు ఆర్థిక సాయం అందిస్తారు.అయితే పెళ్లి చేసుకునే వారిలో ఒకరు షెడ్యూల్డ్ క్యాస్ట్‌కు చెందిన వారు అయి ఉండాలి.

అలాగే మరొకరు నాన్ షెడ్యూల్డ్ క్యాస్ట్‌కు చెందిన వారు అయ్యి ఉంటేనే ఈ స్కీమ్ వర్తిస్తుంది.

Telugu Laksh, Latest, Marraige-Latest News - Telugu

అలాగే మన హిందూ వివాహ చట్టం ప్రకారం 1955 కింద వీరి పెళ్లి తప్పకుండా నమోదు అయి ఉండాలి.ఆ సర్టిఫికెట్ ను వీరికి అందించాల్సి ఉంటుంది.ఒకవేళ హిందూ వివాహ చట్టం కింద వేరే పద్దతిలో పెళ్లి చేసుకున్న వారు అయితే ఆ సర్టిఫికెట్‌ను కూడా అందించాల్సి ఉంటుంది.మొదటి సారి కులాంతర విహహం చేసుకున్న వారికి మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది.

పెళ్లి అయిన ఏడాదిలోపే ఈ స్కీమ్ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.కులాంతార వివాహం చేసుకున్న వారికి మొత్తంగా రూ.2.5 లక్షల వరకు ఆర్థిక సాయం అందిస్తారు.ఇందులో రూ.1.5 లక్షల మొత్తాన్ని ఆన్‌లైన్ ద్వారా ఇద్దరి పేరు మీద ఉన్న జాయింట్ బ్యాంక్ అకౌంట్‌లో జమ చేస్తారు.మిగతా డబ్బులు ఫౌండేషన్‌లోనే ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసి మూడేళ్ల తర్వాత ఈ డబ్బులను వడ్డీతో కలిపి ఆ దంపతులకు అందచేయడం జరుగుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube