నేటి నుండి మళ్లీ షర్మిల పాదయాత్ర ప్రారంభం..!!

తెలంగాణ వైఎస్ఆర్ పార్టీ స్థాపించిన తర్వాత వైయస్ షర్మిల “ప్రజా ప్రస్థానం” పేరిట పాదయాత్ర ప్రారంభించడం తెలిసిందే.అయితే అదే సమయంలో ఒమిక్రన్ కేసులు ఒక్కసారిగా పెరిగిపోవడంతో పాదయాత్రకు బ్రేక్ ఇవ్వటం జరిగింది.

 Sharmila Padayatra Starts Again From Today Details, Ys Sharmila, Praja Prasthana-TeluguStop.com

దాదాపు 21 రోజులపాటు పాదయాత్ర చేయడం జరిగింది.అయితే ప్రస్తుతం బయట పరిస్థితి సాధారణ స్థితికి చేరడం తెలిసిందే.

ఈ నేపథ్యంలో నేటి నుండి 22 వరోజు గతంలో ఎక్కడైతే పాదయాత్ర ఆగిపోయిందో అక్కడి నుండి తిరిగి మొదలు పెట్టడానికి అనగా నల్గొండ జిల్లా కొండపాక గూడెం నుండి పాదయాత్ర చేయటానికి షర్మిల రెడీ అయ్యారు.

ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం పదకొండున్నర గంటలకు లోటస్ పాండ్ లో పార్టీ కార్యాలయం నుండి… వైయస్ షర్మిల పాదయాత్రకు బయలుదేరనున్నారు.

మధ్యాహ్నం 3:30 గంటలకు కొండపాక గూడెం గ్రామానికి చేరుకుని అక్కడ స్థానికులతో మాట్లాడనున్నారు.అనంతరం వారి సమస్యలు తెలుసుకున్న తరువాత పాదయాత్ర కొనసాగిస్తూ నార్కెట్ పల్లి లో షర్మిల బహిరంగ సభ నిర్వహించ నున్నారు.

అలా పాదయాత్ర చేస్తూ పోతినేని పల్లి చేరుకుని అక్కడ కూడా ప్రజలను ఉద్దేశించి షర్మిల ప్రసంగించ నున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube