కేంద్రం లోనూ, రాష్ట్రం లోనూ ఒకే ప్రభుత్వం ఉంటే ఆశించిన ఫలితాలు వస్తాయని ప్రజలు విశ్వసించారు.. డికే అరుణ

కేంద్రం లోనూ, రాష్ట్రం లోనూ ఒకే ప్రభుత్వం ఉంటే ఆశించిన ఫలితాలు వస్తాయని ప్రజలు విశ్వసించారని తెలంగాణ బీజేపీ  నాయకురాలు డికే.అరుణ స్పష్టం చేశారు.

 Bjp Leader Dk Aruna Comments On Bjp Winning In Four States Details, Bjp Leader D-TeluguStop.com

ఇవాళ ఉదయం వి.ఐ.పి విరామ సమయంలో డికే‌.అరుణ కుటుంబ సమేతంగా స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించు కున్నారు.

అనంతరం వీరికి రంగ నాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా.ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.

అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడుతూ.నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ  ఘన విజయం సాధించడంతో స్వామి వారి ఆశీస్సుల కోసం తిరుమలకు రావడం జరిగిందని, మేము ఆశించిన విధంగా బీజేపీ  విజయ కేతనం ఎగుర వేసిందని ఆనందం వ్యక్తం చేశారు.

బీజేపీకి ఎదురు గాలి వీస్తోందని, చాలా మంది ప్రచారం చేసారని, అందుకు భారతీయ జనతా పార్టీ ఓడిపోవాలని కోరుకున్న వారికి ప్రజలు చెంప పెట్టు లాంటి సమాధానం ఇచ్చారన్నారు.

కేంద్రం లోను.

, రాష్ట్రం లోనూ ఒకే ప్రభుత్వం ఉంటే, ఆశించిన ఫలితాలు వస్తాయని ప్రజలు విశ్వసించరని, నాలుగు రాష్ట్రాల ప్రజలకు ఆమె ధన్య వాదాలు తెలిపారు.తెలంగాణ ముఖ్య మంత్రికి నాలుగు రాష్ట్రాలో బీజేపీ గెలుపే సమాధానం చెప్పిందన్నారు.

తన ప్రభావాన్ని కోల్పోతున్న నేపథ్యంలో థర్డ్ ఫ్రంట్ అనే నినాదాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ తెరపైకి తెస్తున్నారన్నారు.తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ చాలా వ్యతిరేకత ఉందని, కేసీఆర్ పెట్టిన పధకాలు అన్ని ఫెయిల్యూర్ అయ్యాయని, టీఆర్ఎస్ కు ప్రత్యాన్మాయ పార్టీ బీజేపీనే అని ఆమె తెలియజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube