ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని పురస్కరించుకుని టీమ్ హాస్పిటల్స్ సంయుక్త ఆధ్వర్యంలో అవగహన ర్యాలీ

టీమ్ హాస్పిటల్స్ కిడ్నీ డే…ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని పురస్కరించుకుని కాకినాడ నగరంలో సూర్యగ్లోబల్ మరియు టీమ్ హాస్పిటల్స్ సంయుక్త ఆధ్వర్యంలో అవగహన ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాస్పిటల్ చైర్మన్ BHPS వీర్రాజు,విశిష్ట అతిథిగా ప్రముఖ సినీ నటి ప్రియాంక శర్మ పాల్గొని ర్యాలీని ప్రారంభించారు.

 Awareness Rally Organized By Team Hospitals Us To Mark World Kidney Day , Team H-TeluguStop.com

అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అతిధులు మాట్లాడుతూ జీవితం యొక్క నాణ్యత పై కిడ్నీ వ్యాధుల ప్రభావం చాలా ఎక్కువగా వుంటుందన్నారు.వ్యాధి నివారణ పద్ధతులను ప్రోత్సహించడం,దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధులను నియంత్రించుటలో స్థానిక మరియు జాతీయ వైద్య అధీకారుల ముఖ్యపాత్రను గుర్తు చేయడం,కిడ్నీలు విఫలమైన యెడల కిడ్నీ దానం జీవితాన్ని కాపాడే చర్య అని మరియు కిడ్నీల మార్పిడి మాత్రమే అత్యుత్తమ ఎన్నిక అని ప్రోత్సహించుట తదితర లక్ష్యాలతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

ఆహారపు అలవాట్లు ఆరోగ్యానికి మూల సూత్రాలని ప్రతి ఒక్కరూ సరైన ఆహారపు అలవాట్లను చేసుకోవాలని సూచించారు.అనంతరం కిడ్నీ యొక్క విశిష్టత,కిడ్నీ వ్యాధుల నియంత్రణ,జాగ్రత్తలు తదితర అంశాలపై పలువురు వైద్యులు అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు డా రాజా అమరేంద్ర,డా రమణారావు,డా చప్పిడి వెంకటేశ్వరావు,హాస్పిటల్ సిబ్బంది,అధిక సంఖ్యలో విద్యార్థులు,తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube