బీజేపీ మంచి జోష్ మీద ఉంది.ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ప్రభావం స్పష్టంగా కనిపించడం తో తెలంగాణ లో పార్టీ పరిస్థితి గందరగోళంగా మారింది.
ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాజకీయాలపై మరింత ఫోకస్ పెట్టే అవకాశం కనిపిస్తోంది.ఇప్పటికే తెలంగాణ లో బీజేపీ స్పీడ్ పెంచింది.
గతంతో పోలిస్తే మరింతగా పార్టీ పుంజుకుంది.అధికారం సాధించే స్థాయికి ఎదిగింది.
దీంతో తెలంగాణ బీజేపీ ఒక గాడిలో పడినట్లుగానే అధిష్టానం అభిప్రాయపడుతోంది.ఇక ఇప్పుడు పూర్తి స్థాయిలో దృష్టంతా ఏపీ పై పెట్టబోతున్నారట.
ఎప్పటి నుంచో ఏపీలో బలపడేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది.రకరకాల రాజకీయ ఎత్తుగడలు వేస్తూ, బలపడేందుకు, అధికారాన్ని సాధించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
అయినా బీజేపీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు గా తయారయ్యింది.
ఈ పరిస్థితి నుంచి బయటపడేసేందుకే జనసేన పార్టీతో బిజెపి పొత్తు పెట్టుకుంది.
ఎన్నికల వరకు ఆ పొత్తు కొనసాగిస్తూ, ఉమ్మడిగా అధికారంలోకి రావాలని కలలు కంటోంది.అయితే బీజేపీ విషయంలో జనసేన అంత సానుకూలంగా ఉన్నట్టు గా వ్యవహరించడం లేదు స్వతంత్రంగానే బలపడేందుకు ప్రయత్నాలు చేస్తోంది బీజేపీకి నష్టం చేకూరుస్తాయి అనే విషయం తెలిసిన ఎవరికి వారికే అన్నట్లుగా ప్రస్తుతం వ్యవహరిస్తున్నారు.
గతంలో బీజేపీ జనసేన అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా ఉంటాను అంటూ ఏపీ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటన చేసినా, ఆ తర్వాత జనసేన కు దూరంగా ఉన్నట్టు గానే బిజెపి వ్యవహరిస్తోంది.

ఇప్పుడు మారిన రాజకీయాల నేపథ్యంలో పవన్ మరింత దూకుడుగా ఏపీ రాజకీయాలు చేయాలని వైసిపి టిడిపిలకు గట్టి పోటీ ఇచ్చే స్థాయికి తమ రెండు పార్టీల కూటమిని ముందుకు తీసుకెళ్లాలని ఎత్తుగడలో బీజేపీ ఉండటంతో ఇక మరింత పవన్ ప్రాధాన్యాన్ని పెంచాలని డిసైడ్ అయ్యారట.జనసేన పార్టీతో బిజెపి పొత్తు పెట్టుకున్న తర్వాత ప్రధాని నరేంద్ర మోడీతో పాటు బిజెపి అగ్రనేతలు అపాయింట్మెంట్ పవన్కు లభించలేదు ఎన్నిసార్లు కలిసే ప్రయత్నం చేసిన సాధ్యపడలేదు ఈ విషయంలో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.దీంతో ఇప్పుడు పవన్ కు బీజేపీ పై సానుకూల అభిప్రాయం ఏర్పడే విధంగా పవన్ ను ఢిల్లీకి పిలిపించి ఆయనలో సంతృప్తి పెంచే విధంగా పరిస్థితిని మార్చాలని డిసైడ్ అయ్యారట.








