ప్లాస్టిక్ సర్జరీకి ఆ పేరు ఎలా వ‌చ్చిందో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు!

ప్లాస్టిక్ సర్జరీ అనే చికిత్స గురించి మీరు వినే ఉంటారు అయితే సర్జరీ సమయంలో ప్లాస్టిక్ వాడకం లేనప్పుడు ఇలా ఎందుకు అంటారో మీకు తెలుసా? ఇది బ్రెస్ట్ ఇంప్లాంట్స్‌తో ముడిప‌డివుంది. ప్లాస్టిక్ సర్జరీ అనే పదాన్ని తొలిసారిగా 1837లో ది లాన్సెట్ అనే మెడికల్ జర్నల్‌లో ఉపయోగించారు.

 Why Is It Called Plastic Surgery , Plastic Surgery , Breast Implants , The Medi-TeluguStop.com

ఈ సర్జరీలో ప్లాస్టిక్ అనే పదాన్ని చేర్చడానికి కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం… మెంటల్ ఫ్లోస్ నివేదికలో ఒహియోకు చెందిన ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ బ్రియాన్ డోర్నర్ మాట్లాడుతూ చాలామంది రొమ్ము ఇంప్లాంట్‌లను ప్లాస్టిక్ సర్జరీతో ముడిపెడ‌తారు.బ్రెస్ట్ ఇంప్లాంట్ ప్లాస్టిక్‌తో తయారైందని, అలా చేసే సర్జరీని ప్లాస్టిక్ సర్జరీ అంటారని అనుకుంటారు.

అయితే దీనికి అసలు కారణం వేరే ఉంది.రొమ్ము ఇంప్లాంట్లు సిలికాన్ షెల్స్‌తో తయార‌వుతాయి.

ఇవి సిలికాన్ జెల్‌తో నిండి ఉంటాయి.

డాక్టర్ బ్రియాన్ డోర్నర్ తెలిపిన వివ‌రాల ప్రకారం సిలికాన్ కూడా ఒక రకమైన ప్లాస్టిక్.

రబ్బరు మరియు ప్లాస్టిక్ కలపడం ద్వారా దీనిని తయారు చేస్తారు.అయితే శస్త్రచికిత్సలో ప్లాస్టిక్ అనే పదాన్ని ఉపయోగించడం వెనుక ఖచ్చితమైన కారణం దశాబ్దాల క్రితం నాటిది.

ప్లాస్టిక్ లాటిన్ పదం ప్లాస్టికస్ నుండి ఉద్భవించిందని నివేదిక పేర్కొంది.సరిపోయేలా ఏదైనా పరిమాణాన్ని మార్చడం అని దీని అర్థం.వివిధ రూపాల్లో మలచవ‌చ్చ‌ని దాని అర్థం.17వ శతాబ్దంలో ఈ పదాన్ని ఎక్కువగా ఉపయోగించడం ప్రారంభించారు.ఈ విధంగా మానవ శరీరంలోని ఏదైనా భాగం శస్త్రచికిత్స ద్వారా రూపొందించారంటే దానిని ప్లాస్టిక్ సర్జరీ అని అంటున్నారు.శరీరానికి అందమైన,సరైన ఆకృతిని ఇవ్వడానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకునే వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోంది.

ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవడంలో మహిళలే కాదు పురుషుల సంఖ్య కూడా పెరుగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube