మనం పుట్టిన ఊరి పేరు చెప్పుకుంటూ గర్వంగా బతుకుతుంటాం.అయితే వారి ఊరి పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడే ప్రదేశమొకటుంది.
నిజానికి స్వీడన్‌లోని ఓ గ్రామంలో నివశిస్తున్న ప్రజలకు తమ ఊరి పేరు చెప్పడం ఇబ్బందిగా మారింది.తమ ఊరి పేరు చెప్పడానికి వారు సంకోచిస్తారు.
సెన్సార్ కారణంగా సోషల్ మీడియాలో వారు గ్రామం పేరు కూడా రాయలేకపోతున్నారు.ఇప్పుడు తమ గ్రామం పేరు మార్చాలని గ్రామస్తులు అధికార యంత్రాంగానికి విజ్ఞప్తి చేశారు.
పేరు చరిత్రకు సంబంధించినదే అయినా , ఈ ఊరి పేరు చెప్పాలంటే గ్రామస్తులు సిగ్గుతో తల వంచుకుంటున్నారు.చరిత్రతో ఈ పేరుకు ముడిపడి ఉంది.
అప్పట్లో ఈ పేరు ఇబ్బందిగా అనిపించకపోవచ్చు.కానీ ఇప్పుడు ఈ పేరు గ్రామస్తులకు తలవంపులు తెస్తోంది.
డైలీ స్టార్ కథనం ప్రకారం, స్వీడన్‌లోని ఈ గ్రామం పేరు ‘ఫక్‘.ఇప్పుడు ఈ పేరు మార్చుకోవాలని గ్రామస్తులు ప్రచారం ప్రారంభించారు.
ఈ గ్రామం పేరు చారిత్రాత్మకమైనది.దీనికి 1547 లో ఈ పేరు పెట్టారు.చరిత్రతో ముడిపడినది, పాత పేరు అయినందున స్వీడన్ నేషనల్ ల్యాండ్ సర్వే డిపార్ట్‌మెంట్ కూడా ఈ పేరును మార్చడంలో ఇబ్బంది పడుతోంది.అయితే తాము ఎప్పటికీ ఈ గ్రామం పేరును వేరే విధంగా మార్చాలని డిమాండ్ చేస్తూనే ఉంటామని గ్రామస్తులు చెబుతున్నారు.
ఇక్కడ చాలామందిమి ఉంటున్నామని, తమ గ్రామం పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నామని వీరంతా వాపోతున్నారు.ఓ గ్రామస్థుడు ఒక న్యూస్ ఛానెల్‌తో మాట్లాడుతూ తమ గ్రామం ప్రశాంతంగా ఉందని, ఇక్కడి ప్రజలు సంతోషంగా ఉన్నారని, ఇప్పటికైనా ఈ గ్రామం పేరు మార్చాలని కోరుతున్నారు.
ఊరిపేరు కారణంగా ఇక్కడివారు సోషల్ మీడియా సెన్సార్‌షిప్‌కు గురవుతున్నారు.సోషల్ మీడియాలో అభ్యంతరకరంగా లేదా అశ్లీలంగా అనిపించే పేర్లను తొలగిస్తారు.
దీంతో గ్రామస్తులు తమ ఊరి పేరు కారణంగా ఫేస్‌బుక్‌లో ఎలాంటి పోస్టులు పెట్టరు.







