పిల్లి మాత్రమే కాదు.ఈ జంతువులు కూడా దారిలో ఎదురుకావడం చెడ్డ శకునంగా పరిగణిస్తారు.
మనం ఎక్కడికో వెళ్తున్నప్పుడుఅకస్మాత్తుగా పిల్లి ఎదురుకావడం ఎప్పుడో ఒకప్పుడు జరిగే వుంటుంది.అలాంటప్పుడు కొందరికి మనసులో ఒక భయం వేస్తుంటుంది.
ఆ సమయంలో పాదాలు ఒక్క క్షణం ఆగిపోతాయి.మనం వెళ్లే దారిలో పిల్లిలో అడ్డుపడితే అశుభం అని చాలామంది చెబుతుంటారు.
అయితే పిల్లి మాత్రమే కాకుండా, ఇతర జంతువులు ఎదురు పడటం అశుభానికి సూచనట.జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, పిల్లి మనకు దారిలో అడ్డుపడటం ఎల్లప్పుడూ అశుభం కాదు.
పిల్లి మనకు ఎడమ వైపు నుండి దాటినప్పుడు, అది శుభప్రదంగా పరిగణించాలి.మరోవైపు కొన్ని గ్రంథాల ప్రకారం కొన్ని ప్రత్యేక పరిస్థితులలో ఒక నిర్దిష్ట జంతువు లేదా పక్షి మన మార్గానికి అడ్డుపడటం చాలా చెడ్డ శకునంగా పరిగణిస్తారు.
దీని వల్ల పనులు విఫలం అవుతాయట.ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
కుక్క: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీరు ఏదో పని మీద బయటకు వెళుతుంటే, దారిలో కుక్క మిమ్మల్ని వెంబడిస్తూ కనిపిస్తే, అది చెడ్డ సంకేతంగా పరిగణించాలి.అప్పుడు మీరనుకున్న పని జరగదట.

కాకి: ఇది మీ తలను తాకినట్లయితే, మీరు వెంటనే అప్రమత్తంగా ఉండాలి. కాకి తలను తాకడం శారీరక బాధలకు సూచికగా పరిగణిస్తారు.ఒక నమ్మకం ప్రకారం అటువంటి వ్యక్తి వ్యాధి కారణంగా మరణాన్ని ఎదుర్కోవలసి వస్తుందట.
ఆవుల మంద: శకుశ శాస్త్రం ప్రకారం, ఆవుల మంద మనకు మార్గంలో ఎదురైతనే మనం కొద్దిసేపు ఆగాలి.ఇది రాబోయే సంక్షోభం నుండి మనల్ని కాపాడుతుందని నమ్ముతారు.బురద అంటుకున్న కుక్క ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు బురద అంటుకున్న కుక్క ఎదురైతే అశుభమట.
అయితే కుక్క తన నోటిలో మాంసపు ముక్కను తీసికెళుతూ కనిపిస్తే అది శుభప్రదం.

ముంగిస: ముంగిస ఎదరైతే మనం కొంత సేపు ఆగాలి.లేకుంటే మీ ప్రత్యర్థులు మీ పనిలో ఆటంకం కలిగించవచ్చు,అయితే తెల్లవారుజామున ముంగిసను చూడటం కూడా చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు.ఇది సంపద వృద్ధికి సూచనగా పరిగణించాలట.
పాము: శకునాల ప్రకారం మీరు ఏదైనా పని మీద బయటకు వెళుతుంటే పాము ఎదురైతే అది అశుభ సంకేతం.మీ పని కాదని దాని అర్థం.
దీనితో పాటు శత్రువుల భయం మిమ్మల్ని వెంటాడుతుందట. పాము మనకు దారిలో ఎదురైతే జీవితంలో పెను మార్పులు వస్తాయని నమ్ముతుంటారు.








