ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీల పెళ్ళిళ్ళ సందడి ప్రారంభమైంది.ఆదివాసీల పెళ్ళిళ్ళలో కొలాహలం నెలకొంటుంది.
డోలు వాయిద్యాలు.డెమ్సా నృత్యాలతో ఆదివాసీల పెళ్ళి ఆదివాసీల ప్రాచిన సాంప్రదాయం ప్రకారం నిర్వహిస్తారు.
ఆదివాసీల పెళ్ళిల్లో ఈ మద్య అల్లుళ్ళకు కట్నంగా ఎడ్లబండ్లను ఇస్తున్నారు.ఈ రోజుల్లో పెళ్లి కొడుకుకి పిల్లనిచ్చే మామ ద్విచక్ర వాహనమో, స్థాయిని బట్టి కారో ఇవ్వడం పరిపాటి.
అయితే ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం దొంగచింత గ్రామానికి చెందిన పెందూర్ లచ్చు – పారుబాయి ల కుమార్తె లింగుబాయి కి.ఉట్నూర్ మండలం చింతకర్ర గ్రామానికి చెందిన కుమ్ర వినంతిరావ్ – బొజ్జుబాయి ల కుమారుడు జుగాదిరావ్ కు వివాహం జరిగింది.దొంగచింత గ్రామంలో ఈ ఇద్దరి వివాహం ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం డోలు వాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా జరిగింది.అయితే పెందూర్ లచ్చు కుమార్తె లింగుబాయి ని వివాహమాడి అల్లుడైన కుమ్ర జుగాధిరావ్ కు కట్నంగా రెండు జతల ఎడ్లు.
ఓ ఎడ్లబండిని అందంగా అలంకరించి అందించాడు.తన అల్లుడు, కుమార్తెకు జత ఎడ్లు, ఎడ్లబండిని పెళ్లి మండపంలోనే కానుకగా ఇచ్చాడు.వాటిని ఆదరంగా స్వీకరించారు నూతన దంపతులు జుగాదిరావు-లింగుబాయి.అనంతరం ఎడ్లకు పూజ చేసి ఆ బండిపైనే వధువుని మండలం చింతకర్రలోని తమ ఇంటికి తీసుకెళ్లాడు వరుడు.
ఈ కాలంలో అందరు పెళ్ళిళ్ళలో తులం బంగారం.ఓ బైకు , కారు.
ఇతర వస్తువులు ఇస్తుంటారు.కాని ఆదివాసీలకు ఇవేమి సరిగ్గా ఉపయోగపడవని.
వారి వృత్తి ప్రకారం వ్యవసాయం తమకు ఆధారం.కాబట్టి వ్యవసాయానికి ఉపయోగపడేవే ముఖ్యమని ఇలా వినూత్న రీతిలో పెళ్ళిళ్ళలో ఎడ్లబండిని అందిస్తున్నారు.
వాహనాలతో ప్రమాదం కూడా అని వాటితో అంతగా ఉపయోగమేమని ఎద్దులతో పొలం దున్నుకోవచ్చని ఎడ్లబండిపై పొలానికి ఊర్లకు వెళ్ళొచ్చని ఇలా అరుదైన ఐడియాలజీని ఆదివాసీలు వినియోగిస్తున్నారు.ప్రస్తుతం ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీలు పెళ్ళిళ్ళలో ఎడ్లబండ్లను ఇవ్వడం ఓ ట్రెండ్ గా మారింది.







