తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగాల ప్రకటన ఎంతగా సంచలనం సృష్టించిందో మనకు తెలిసిందే.అయితే కేసీఆర్ ప్రకటన తరువాత షర్మిల, రేవంత్ రెడ్డి, బండి సంజయ్ స్పందించిన విషయం తెలిసిందే.
అయితే బీఎస్పీ నేత ప్రవీణ్ కుమార్ మాత్రం ఈ ప్రకటనపై స్పందించని పరిస్థితి ఉంది.అయితే దీనిపై రకరకాల చర్చ జరుగుతోంది.
అయితే ప్రస్తుతం తెలంగాణలో బీఎస్పీ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా కేసీఆర్ టార్గెట్ గా ముందుకు వెళ్తున్న సంగతి తెలిసిందే.
అయితే ఇక రకరకాలుగా టీఆర్ఎస్ ను కెసీఆర్ ను విమర్శించిన ప్రవీణ్ కుమార్ ఒక్కసారిగా మౌనం వహించడం పలు రకాల చర్చలకు తావిస్తోంది.
అయితే బీఎస్పీ పార్టీ విధానం సంప్రదాయ పార్టీల విధానాలకు పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది.వారికంటూ ప్రత్యేకంగా ఒక మేనిఫెస్టో అనేది ఉండదు.రాజ్యాంగమే మా మేనిఫెస్టో అని బీఎస్పీ పార్టీ ఎప్పటి నుండో స్పష్టం చేస్తున్న పరిస్థితి ఉంది.అయితే తెలంగాణలో కూడా ఎంతో కొంత సత్తా చాటాలని భావిస్తున్న బీఎస్పీ తెలంగాణలో రాజకీయ విధానం అనే దానిని ఇప్పటికీ స్పష్టం చేయని విషయం తెలిసిందే.

కానీ ప్రవీణ్ కుమార్ మాత్రం క్షేత్ర స్థాయిలో అణగారిన వర్గాలను కలుస్తూ వారి సమస్యలు తెలుసుకుంటూ వారికి బీఎస్పీ అండగా ఉంటుందనే భరోసానిస్తున్న పరిస్థితి ఉంది.అయితే రానున్న రోజుల్లో ఉద్యోగ నియామక ప్రక్రియ పై టీఆర్ఎస్ అవలంబించే విధానాన్ని ప్రశ్నించే అవకాశం లేకపోలేదు.అయితే బీఎస్పీ విమర్శలకు ఇప్పటి వరకు ఇటు టీఆర్ఎస్ నుండి కాని, కెసీఆర్ నుండి కాని ఎటువంటి స్పందన అనేది రానటువంటి పరిస్థితి ఉంది.ఏది ఏమైనా రానున్న రోజుల్లో ప్రవీణ్ కుమార్ రాజకీయ వ్యూహం ఎలా ఉంటుందనేది చూడాల్సి ఉంది.