సోషల్ మీడియా కారణంతో ప్రపంచంలో ఏ మూల ఆసక్తికర ఘటన జరిగినా మనకు తెలిసి పోతోంది.వాటి తాలూకా వీడియోలు మనం ఫోన్‌లలో చూసేస్తున్నాం.
అందులో ఏ మాత్రం వెరైటీగా ఉన్న షేర్లు, కామెంట్లు, వ్యూస్ విపరీతంగా వస్తాయి. కుక్క, పిల్లి స్నేహంగా ఉండడమో, కోడి – కుక్క కలిసి ఉండడం ఇలా ఎన్నో వైవిధ్యమైన వీడియోలను మనం చూసే ఉంటాం.
అయితే ఇప్పుడు ఓ అడవిలో ఏనుగు, అడవి దున్న పరస్పరం తలపడిన వీడియో ఆసక్తి కరంగా ఉంది.
పచ్చిక బయళ్లలో జంతువుల పోరు:
ఆ వీడియోలో చుట్టూ చక్కని ఆహ్లాదకరమైన రీతిలో పచ్చిక బయళ్లు కనిపిస్తున్నాయి.అక్కడ ఓ ఏనుగు పిల్ల సంచరిస్తోంది.అకస్మాత్తుగా ఓ అడవి దున్న ఆ ప్రాంతానికి వచ్చింది.వచ్చీ రావడంతోనే ఏనుగు పిల్లపై దాడికి యత్నించింది.అయితే ఏనుగు పిల్ల కూడా తీవ్రంగా ప్రతిఘటించింది.
మొదట దూరంగా ఉన్న అడవి దున్నను ఏనుగు పిల్ల చూసింది.దాని ముందుకు వేగంగా వెళ్లి ఏ మాత్రం బెదరకుండా నిల్చుంది.
దీంతో దాడి చేద్దామన్న ఆలోచనను అడవి దున్న విరమించుకుంది.చివరికి చేసేదేమీ లేక అడవిదున్న వెను దిరిగింది.
వీడియోకు విపరీతమైన క్రేజ్:
ఇలాంటి ఆసక్తికర విషయాలు కావొచ్చు, వీడియోలు కావొచ్చు.ఎవరో ఒకరు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు.
తాజాగా ఏనుగు పిల్ల-అడవి దున్న వీడియోను కూడా నీలగిరి ప్రాంతానికి చెందిన కిషోర్ చంద్రన్ అనే వ్యక్తి ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు.కొద్ది సేపటికే దీనికి అధిక సంఖ్యలో కామెంట్లు, షేర్లు వచ్చాయి.
చాలా మంది ఆ జంతువుల పోరుపై ఆసక్తికరంగా కామెంట్లు పెడుతున్నారు.







