కేసీఆర్ టార్గెట్ అని పరోక్ష సంకేతాలు ఇచ్చిన ప్రతిపక్షాలు

తెలంగాణ రాజకీయాలు పెద్ద ఎత్తున రకరకాల మలుపులతో హాట్ హాట్ గా మారుతున్న పరిస్థితి ఉంది.నిన్న కేసీఆర్ అసెంబ్లీలో ఉద్యోగాల ప్రకటన చేసిన విషయం తెలిసిందే.

 Opposition Parties Have Given Indirect Signals That Kcr Is The Target Bjp Party-TeluguStop.com

అయితే ప్రతిపక్షాలు ఉద్యోగ ప్రకటనను స్వాగతిస్తాయని అందరూ భావించినా అందుకు విరుద్దంగా ప్రతిపక్షాలు వ్యవహరించడం ప్రకటించిన ఉద్యోగాలు తక్కువగా ఉన్నాయని విమర్శించడంతో సరికొత్త చర్చ అనేది రాజకీయ వర్గాలలో సాగుతోంది.అదేంటంటే కేసీఆర్ మాత్రమే తమ టార్గెట్ అని మంచి మంచి నిర్ణయాలను స్వాగతించే పరిస్థితి లేదనే పరోక్ష సంకేతాలు ఇస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

కేసీఆర్ ను రాజకీయంగా సీఎం కుర్చీ నుండి దింపడమే ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.అంతే కాక యువత కూడా రాజకీయ పార్టీల భ్రమలో పడటం కాస్త ఆందోళనకర పరిణామమని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

అయితే ప్రతిపక్షాల విమర్శలకు టీఆర్ఎస్ నుండి ఇంకా ఘాటైన స్పందన రాకున్నా అసెంబ్లీ లోనే ప్రతిపక్షాల విమర్శలకు సమాధానం ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.అయితే ఇంకా అసెంబ్లీలో ప్రకటన మాత్రమే చేయడం ఇంకా శాఖల అధికారిక వెబ్ సైటులలో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన సమాచారం పొందు పరచక పోవడంతో ఇంకా నిరుద్యోగులు శాఖల అధికారిక ప్రకటన కొరకు వేచి చూస్తున్న పరిస్థితి ఉంది.

అయితే ప్రతి పక్షాలు రాజకీయంగా ముందుకు వెళ్ళినా ప్రగతి బాటతోనే ప్రతిపక్షాలకు చెక్ పెట్టే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.

Telugu @bjp4telangana, @cm_kcr, @revanth_anumula, Bandi Sanjay, Bjp, Revanth Red

అయితే ఎన్నో రకాల అవరోధాలను చవి చూసిన కేసీఆర్ దీనిని కూడా చాలా చాక చక్యంగా ముందుకు కదిలే అవకాశం ఉంది.అయితే ఎలా ముందుకు వెళ్లనున్నారనే విషయాన్ని ఇప్పుడే స్పష్టంగా చెప్పలేక పోయినా  రానున్న రోజుల్లో జరిగే పరిణామాలను బట్టి మనకు కాస్త అవగాహన వచ్చే అవకాశం ఉంది.మరి మరోసారి కేసీఆర్ నిరుద్యోగుల విశ్వాసాన్ని పొంద గలుగుతారా లేదా అనేది చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube