యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజాహెగ్డే హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం రాధేశ్యాం.ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు.
దాదాపు నాలుగు సంవత్సరాలుగా ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటు అభిమానులను ఊరిస్తూ వస్తోంది.సాహో సినిమా విడుదలకు ముందుగానే ఈ సినిమా ప్రారంభం అయ్యింది.
కానీ కరోనా ఇతరత్రా కారణాల వల్ల సినిమా వాయిదా పడుతూ వచ్చింది.మొన్న సంక్రాంతి కి ఈ సినిమా విడుదల అవ్వాల్సి ఉన్నా కరోనా వల్ల విడుదల వాయిదా పడిన విషయం తెలిసిందే.
దాదాపు 300 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ సినిమా పై ప్రభాస్ అభిమానులతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ను 10 వేల స్క్రీన్స్ కు పైగా స్క్రీనింగ్ చేయబోతున్నట్లుగా ప్రకటించారు.
ప్రభాస్ స్టార్ డమ్ కు ఆయన క్రేజ్ కు ఏ మాత్రం తగ్గకుండా దర్శకుడు రాధాకృష్ణ అద్భుతమైన విజువల్ వండర్ గా ఈ సినిమా ను తెరకెక్కించారని ఇప్పటికే విడుదలైన ట్రైలర్స్ చూస్తుంటే అనిపిస్తుంది.రికార్డు బ్రేకింగ్ వసూళ్లను ఈ సినిమా దక్కించుకుంటుంది అని నమ్మకం వ్యక్తమవుతోంది.
ఈ సినిమా లో ప్రభాస్ మరియు పూజాహెగ్డే ల లుక్స్ కు ఇప్పటికే మంచి రెస్పాన్స్ దక్కింది.

సినిమా పీరియాడిక్ నేపథ్యం లో రూపొందిన విషయం తెలిసిందే.కనుక ఈ సినిమాలో ప్రతి ఒక్క సన్నివేశం కూడా ఒక అద్భుతమైన కళా ఖండం ఉన్నట్లుగా ఉంటుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మరీ మరీ చెబుతున్నారు.ఈ సినిమా విజువల్స్ హాలీవుడ్ రేంజ్లో ఉంటాయనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సినిమా కోసం ఏకంగా వంద సెట్స్ ను నిర్మించినట్లుగా చెబుతారు.ప్రభాస్ మరియు పూజ లకు ఈ సినిమా మరింత స్టార్‌డమ్ ను తెచ్చిపెడుతుంది అంటున్నారు.
మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన రివ్యూ చూడాలంటే మమ్ములను ఫాలో అవుతూ ఉండండి.







